మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివల కాంబోలో రూపొందుతున్న ఆచార్య సినిమా షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది.ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ జాయిన్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆచార్య సినిమాలో చరణ్ పాత్ర ఒక ఉద్యమం సాగిస్తుంది.ఆ ఉద్యమం సమయంలో త్యాగం చేసి తనకు తాను అర్పించుకోవడం వల్ల సిద్ద పాత్ర ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది.
రామ్ చరణ్ పాత్ర హీరో పాత్ర అయిన ఆచార్యకు ఆదర్శంగా ఉంటుంది. సిద్ద పాత్ర అడుగు జాడల్లోనే చిరంజీవి పాత్ర నడుస్తుందని అంటున్నారు.
ఇద్దరి కాంబో సీన్స్ ఉంటాయని అంటున్నారు.
రామ్ చరణ్ మరియు చిరంజీవి పాత్రలు ఎలా ఉంటాయి అనే విషయంలో గత కొంత కాలంగా అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఆ విషయం పై క్లారిటీ వచ్చింది.కొందరు సినిమాలో అసలు ఆచార్య చిరంజీవి కాదని రామ్ చరణ్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.మొత్తానికి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్న నేపథ్యంలో సినిమాపై మరింతగా అంచనాలు పెంచేలా రామ్ చరణ్ పాత్రను దర్శకుడు కొరటాల శివ చూపించబోతున్నాడు.అద్బుతంగా ఉంటుందని ఇప్పటికే సినిమా యూనిట్ సభ్యులు అంటున్నారు.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించే అవకాశం ఉందని అంటున్నారు.ఇక చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.
ఇప్పటికే ఐటెం సాంగ్ ను రెజీనా కాసాండ్రతో షూట్ చేయడం జరిగింది.మాస్ మసాలా ఎలిమెంట్స్ తో పాటు ఒక మంచి మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు చాలా నమ్మకంగా చెబుతున్నారు.
మే లేదా జూన్ లో ఆచార్య సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.ఇక చరణ్ ఆర్ఆర్ఆర్ లో కూడా ప్రస్తుతం నటిస్తున్న విషయం తెల్సిందే.