మజా ఇస్తున్న 'ఫుల్జార్‌ సోడా' ఈ కొత్తరకం సోడాకు ఫిదా అవుతున్న జనాలు, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?  

Fuljar Soda Fad Froths Up Across Kerala-

ఈమద్య కాలంలో సోషల్‌ మీడియా ఎంత పాపులర్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సోషల్‌ మీడియా కారణంగా చిన్న విషయం కూడా అతి తక్కువ సమయంలోనే ప్రపంచాన్ని చుట్టేస్తుంది.ఇక కొన్ని ఆశ్చర్యకర విషయాలు అయితే ప్రపంచం మొత్తం వైరల్‌ అవుతున్నాయి.టిక్‌టాక్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫార్మ్‌లలో ప్రస్తుతం ఫుల్జార్‌ సోడా తెగ వైరల్‌ అవుతుంది.

Fuljar Soda Fad Froths Up Across Kerala--Fuljar Soda Fad Froths Up Across Kerala-

దాన్ని తయారి మరియు తాగే విధానం చూసిన జనాలు దాని రుచి ఏమో కాని కనీసం ఒక్కసారి అయినా తాగితే బాగుండు అనుకుంటున్నారు.

Fuljar Soda Fad Froths Up Across Kerala--Fuljar Soda Fad Froths Up Across Kerala-

సాదారణ సోదాలకు ఇది చాలా విభిన్నంగా ఉంటుంది.సోడాకు అదనపు హంగులు చేరి పుల్జార్‌ సోడాను తయారు చేస్తున్నారు.కేరళలో పూర్తి శాస్త్రీయంగా, రసాయనాలు లేకుండా మొదట ఇది తయారయ్యింది.సోదా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న కారణంగా దక్షిణ భారతం మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడ అక్కడ పుల్జార్‌ సోడాలు విక్రమయిస్తున్నారు.

సాదారణ సోడా బండిపైనే ఈ సోడాల విక్రయం జరుగుతుంది.ఈ సోడా తయారి చాలా సులభం అవ్వడంతో ఇంట్లో కూడా చేసుకునేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు.

ఈ సోడా తయారి గురించి నెట్‌ లో రకరకాలుగా రెసిపీలు ఉన్నాయి.అవన్నీ కూడా విభిన్న ఫ్లేవర్స్‌ కలిగే రెసిపీలే అని చెప్పుకోవచ్చు.ఒక సోడా బాటిల్‌ ఓపెన్‌ చేసి ఒక గ్లాస్‌ లో పోస్తారు.ఆ గ్లాస్‌లో మరో గ్లాస్‌ను వేస్తారు.ఆ చిన్న గ్లాస్‌లో పుల్జార్‌ సోడా మిశ్రమం ఉంటుంది.బుసలు కొడుతూ పొంగే సోడాను తాగితే ఆ రుచి అమోఘం అంటున్నారు.

ఇంతకు పుల్జార్‌ సోడా మిశ్రమం ఏంటీ అనేది చూద్దాం.దీన్ని తయారు చేసేందుకు అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇంకా కాస్త చెక్కర కావాల్సి ఉంటుంది.

వీటన్నింటిని మిశ్రమం చేసి చిన్న గ్లాస్‌లో వేసుకుని నానబెట్టిన సబ్జ గింజలను కలిపి , ఆ చిన్న గ్లాస్‌ను పెద్ద గ్లాస్‌లో ఉన్న సోడాలో జారవిడిచి పెట్టాలి.కారం, తియ్యగా, పుల్లగా, వగరుగా అన్ని రకాల రుచులు ఈ సోడాలో కనిపిస్తాయి.

ఈ సోడా జీర్ణ వ్యవస్థపై బాగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సైతం చెబుతున్నారు.మొత్తానికి పుల్జార్‌ సోడా సౌత్‌ ఇండియాను ఏలేస్తుంది.వీలుంటే మీరు ట్రై చేయండి.ఇంట్లో తయారు చేసుకోవడం ఇబ్బంది అయితే బయట తాగండి.మీ ప్రాంతంలో ప్రస్తుతానికి లేకున్నా వచ్చే ఏడాది వేసవి వరకు వచ్చే అవకాశం ఉంది దిగులు పడకండి.