టాంజానియా లో ఘోర ప్రమాదం,62మంది మృతి!

టాంజానియా లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.ఆయిల్ తో వెళుతున్న ఒక ట్యాంకర్ బోల్తాపడడం తో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

 Fuel Tanker Explosion In Tanzania 62 People Dead-TeluguStop.com

వాస్తవానికి ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడినప్పుడు ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ ఆ తరువాత జనాల హడావిడి తో అక్కడ ప్రమాదం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే… టాంజానియా రాజధాని ధార్ ఎస్ సలామ్ కు పశ్చిమంగా ఉన్న మొరగోరో లో ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది.

అయితే దీనితో అక్కడ చుట్టుపక్కల ప్రజలు సమాచారం తెలుసుకొని పెట్రోల్ తీసుకెళ్లేందుకు వందల సంఖ్యలో తరలివచ్చారు.అయితే ఈ సమయంలో ఏదైతే చేయకూడదో అదే పని ఒక స్థానికుడు చేయడం తో ఒక్కసారిగా అక్కడ ప్రమాదం చోటుచేసుకుంది.

ఇంతకీ ఆ వ్యక్తి ఏమి చేశాడంటే, ట్యాంకర్ బోల్తాపడిన చోట సిగరెట్ వెలిగించడం తో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.దీనితో అక్కడ ఉన్న వారిలో 62 మంది సజీవదహనం కాగా,మరో 70 మంది తీవ్రంగా గాయాలపాలైనట్లు తెలుస్తుంది.

టాంజానియా లో ఘోర ప్రమాదం,62మంద�

ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు తెలుస్తుంది.అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube