సౌందర్య పోషణలో.... పండ్ల తొక్కలు ఎలా సహాయపడతాయి?     2016-08-09   03:28:32  IST  Lakshmi P

మనం సాధారణంగా పండ్లను తిని పై తొక్కను పడేస్తూ ఉంటాం. కానీ ఆ తొక్కలు సౌందర్య పోషణకు సహాయపడతాయి. వాటిల్లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి.

బొప్పాయి

బొప్పాయి తొక్కను మెత్తని పేస్ట్ గా చేసి ముఖానికి రాసి పది నిముషాలు అయ్యాక శుభ్రం చేసుకుంటే మృతకణాలు తొలగిపోతాయి.

ఆపిల్

ఆపిల్ తొక్కతో ముఖాన్ని మసాజ్ చేసుకుంటే చర్మ కణాలు ఉత్తేజితం అవుతాయి. ఈ తొక్కలో ఉండే ఫాలిఫెనాల్స్ చర్మం మీద ఉండే వ్యర్ధాలతో పోరాటం చేస్తాయి.

నిమ్మ

నిమ్మతొక్కలను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో స్నానము చేసే చర్మంనకు నిగారింపు వస్తుంది. ఆ నీటిలో ఉండే యాంటీ సెప్టిక్ లక్షణాలు మరియు సిట్రిక్ ఆమ్లం చర్మ నిగారింపులో సహాయపడతాయి.

దానిమ్మ

దానిమ్మ తొక్కలను మెత్తని పేస్ట్ గా చేసుకొని ముఖానికి పట్టించి పావుగంట అయ్యాక ముఖాన్ని కడిగితే మంచి మెరుపు వస్తుంది.

బంగాళాదుంప

కొందరికి అప్పుడప్పుడు ముఖం,కళ్ళు ఉబ్బినట్టు కన్పిస్తాయి. బంగాళాదుంప ఉడికించిన నీటితో ముఖాన్ని కడిగితే ఈ సమస్య నుండి బయట పడవచ్చు.