అబ్బబ్బా.ఏం ఎండలో.
ఏం లోకమో! ఉదయం పది దాటిన తర్వాత బయట కాలు పెడితే చాలు ఎండలు మంట పుట్టించేస్తున్నాయి.ఎండల దెబ్బకు చెమటలు, ఉక్కపోత, చికాకుతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
ఇక మండే ఎండలు ఆరోగ్యంపైనే కాకుండా చర్మంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.ఈ క్రమంలోనే చర్మం నల్లగా మరియు కాంతి హీనంగా మారిపోతోంది.
దాంతో ఏం చేయాలో తెలియక రకరకాల క్రీములు, లోషన్లు కొనుగోలు చేసి వాడుతున్నారు.
అయితే కొన్ని కొన్ని ఫ్రూట్ ప్యాక్స్ ను పాటిస్తే.
ఎండల దెబ్బకు నల్లబడిన చర్మాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకురావొచ్చు.మరి లేట్ చేయకుండా ఆ ఫ్రూట్ ప్యాక్స్ ఏంటో చూసేయండి.
నల్లబడిన చర్మాన్ని తెల్లగా, కాంతివంతంగా మార్చడంలో పుచ్చకాయ అద్భుతంగా సహాయపడుతుంది.ఒక బౌల్ తీసుకుని అందులో పుచ్చకాయ గుజ్జు మరియు తేనె వేసి బాగా మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి.
ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు డ్రై అవ్వనిచ్చి.అనంతరం కూల్ వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేస్తే.మంచి ఫలితం ఉంటుంది.
అలాగే పైనాపిల్‌తో కూడా నల్లబడిన చర్మాన్ని నివారించుకోవచ్చు.పైనాపిల్‌ను పేస్ట్ చేసి ఒక బౌల్లో వేసుకుని.
అందులో కొద్దిగా పాలు వేసి కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి.
అరనివ్వాలి.ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని మెల్ల మెల్లగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి.
ఇలా డే బై డే చేస్తూ ఉంటే.చర్మం తెల్లగా మరియు మృదువుగా మారుతుంది.
ఇక బొప్పాయి కూడా చర్మ నలుపుకు చెక్ పెట్టగలదు.బొప్పాయి గుజ్జులో కొద్దిగా నిమ్మ రసం మరియు తేనె వేసి కలిపి.ముఖానికి పట్టించాలి.పావు గంట పాటు ఆరిన తర్వాత.చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే.
చర్మం తెల్లగా, తాజాగా మారుతుంది.