మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం గొప్ప విషయమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.కానీ రిజర్వేషన్లను తక్షణం అమలు చేయాలనే యోచన కేంద్రానికి లేదని ఆరోపించారు.
అసలు ఎప్పటి నుంచి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయో కూడా చెప్పలేమని రాహుల్ గాంధీ తెలిపారు.ఇతర అంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కేంద్రం ఈ బిల్లును తెరపైకి తెచ్చిందని విమర్శించారు.
ఈ నేపథ్యంలోనే గతంలో చేసిన జనాభా గణాంకాల వివరాలను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.అదేవిధంగా ఓబీసీలు, ఇతర బలహీన వర్గాల జనాభాను నిర్ధారించేందుకు తాజాగా కుల గణన చేపట్టాలని పేర్కొన్నారు.
అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పూర్తి మద్ధతు ఇస్తుందని స్పష్టం చేశారు.