నేటి నుంచి బడులు.. మార్గదర్శకాలు అమలు తప్పనిసరి

మార్గదర్శకాలు అమలు తప్పనిసరి ఈనెల 16 నుంచి పాఠశాలల్లో విద్యా సంస్థలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది విద్యా సంస్థలు కూడా ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.2021- 2022 విద్యాసంవత్సరానికి గాను పూర్తిగా కరోనా నిబంధనలు నడుమ పాఠశాలలు తెరవనున్నారు.నాడు – నేడు కార్యక్రమం లో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలను దశల వారీగా అభివృద్ధి చేశారు.రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అతి సుందరంగా రూపుదిద్దుకున్నాయి.

 From Today Onwards .. Implementation Of Guidelines Is Mandatory,  From Tody , An-TeluguStop.com

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా వసతులు కల్పించారు.ఇప్పటికే తరగతుల నిర్వహణ పై విద్యాశాఖ సూచనలు మార్గదర్శకాలు విడుదల చేసింది.

తరగతి గదికి 20 మంది విద్యార్థులు మించకుండా చర్యలు తీసుకుంటున్నారు.స్థానిక పరిస్థితుల ఆధారంగా ప్రతి పాఠశాలకు మెరుగైన సౌకర్యం ఉండాలి విద్యార్థుల సంఖ్య ఆధారంగా రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించే బాధ్యతను ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు.

పాఠశాలల పునఃప్రారంభం  దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులకు కరోనా టీకా వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఇప్పటికే చాలా మందికి ఆ ప్రక్రియ పూర్తయింది.

మిగిలిన వారికి వేయించేలా విద్యాశాఖ చర్యలకు ఉపక్రమించింది.చాలా కాలం తర్వాత పాఠశాల పున ప్రారంభం కావడంతో మళ్లీ సందడి వాతావరణం నెలకొంది.

 ఇలాంటి పరిస్థితుల్లో  విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి విద్యార్థుల తల్లిదండ్రులు భయాదోళన చెందుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube