కొత్త కార్లు కొన్న టాలీవుడ్ ​సెలబ్రిటీలు వీళ్లే.. కార్ల ధరలు ఎంతంటే?

చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ సెలబ్రిటీలను ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.అయితే సెలబ్రిటీలు మాత్రం ఖరీదైన కార్లను ఎక్కువగా ఇష్టపడతారు.

 From Prabhas To Junior Ntr Super Expensive Cars Bought By South Stars-TeluguStop.com

ప్రముఖ కంపెనీలకు చెందిన కొత్త మోడల్ కార్లు మార్కెట్ లోకి వస్తే వెంటనే కొనుగోలు చేయడానికి సెలబ్రిటీలు ఆసక్తి చూపుతుంటారు.ఈ మధ్య కాలంలో పలువురు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు కొత్త కార్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసి మెర్సిడెజ్ కారును కొనుగోలు చేశారు.రామ్ చరణ్ కొనుగోలు చేసిన కారు కష్టమైజ్డ్ వెర్షన్ కావడం గమనార్హం.

 From Prabhas To Junior Ntr Super Expensive Cars Bought By South Stars-కొత్త కార్లు కొన్న టాలీవుడ్ ​సెలబ్రిటీలు వీళ్లే.. కార్ల ధరలు ఎంతంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరో స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా తాజాగా కొత్త కారును కొనుగోలు చేశారు.లాంబోర్ఘిని గ్రాఫైట్ క్యాప్సూల్ కారును ఎన్టీఆర్ కొనుగోలు చేయగా ఈ కారు ధర ఏకంగా 3.16 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.

టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టేటస్ ను సొంతం చేసుకున్న హీరోలలో ఒకరైన స్టార్ హీరో ప్రభాస్ సైతం కొన్ని రోజుల క్రితం కొత్త కారును కొనుగోలు చేయడం గమనార్హం.

Telugu Celebreties Cars Detaisl, Costyly Cars, Interesting Facts, Jr Ntr, Jr Ntr Lamborghini, Prabhas, Prabhas Lamborghini Car, Ram Charan Mercedes Car, Ramya Pandiyan, Shivani Narayan, Super Expensive Cars-Movie

ప్రభాస్ కొనుగోలు చేసిన కారు ధర ఏకంగా ఆరు కోట్లు కాగా లాంబోర్ఘిని అవెంటరాస్ రోడ్ స్టర్ కారును ప్రభాస్ కొనుగోలు చేశారు.ఒకవైపు స్టార్ హీరోలు కొత్త కార్లను కొనుగోలు చేస్తుంటే మరోవైపు స్టార్ హీరోయిన్లు సైతం కొత్త కార్లపై ఆసక్తి చూపుతున్నారు.

Telugu Celebreties Cars Detaisl, Costyly Cars, Interesting Facts, Jr Ntr, Jr Ntr Lamborghini, Prabhas, Prabhas Lamborghini Car, Ram Charan Mercedes Car, Ramya Pandiyan, Shivani Narayan, Super Expensive Cars-Movie

కోలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన శివానీ నారాయణన్ ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశారు.ఈ హీరోయిన్ కొన్న కారు ధర ఏకంగా కోటీ 20 లక్షల రూపాయలు కావడం గమనార్హం.మరో హీరోయిన్ రమ్య పాండియన్ బీఎండబ్ల్యూ జీటీ కారును కొనుగోలు చేశారు.ఈ కారు ఖరీదు 68 లక్షల రూపాయలు అని తెలుస్తోంది.

#Jr NTR #Prabhas #Ramya Pandiyan #Costyly Cars #CharanMercedes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు