ఆ ఒక్క షార్ట్‌ ఫిల్మ్ నుండి మహర్షి వచ్చింది.. ఇప్పుడు శ్రీకారం రాబోతుందట

శర్వానంద్‌ హీరోగా రూపొందిన శ్రీకారం సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.మొన్నటి వరకు ఈ సినిమా గురించి పెద్దగా పట్టించుకోని జనాలు ఈ సినిమా కు చిరంజీవి చరణ్‌ తో పాటు ఇంకా ప్రముఖులు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆసక్తి పెంచేసుకున్నారు.

 From One Short Film Maharshi And Srikaram Films Came , Maharshi, Mahesh Babu, Sh-TeluguStop.com

ఈ సినిమా షూటింగ్ గత ఏడాది పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు విడుదల విషయమై థియేటర్‌ రిలీజ్ కే మొగ్గు చూపించారు.రైతుల పై వ్యవసాయంపై రూపొందిన ఈ సినిమా తప్పకుండా ఘన విజయం అవుతుందనే నమ్మకంను చిరంజీవి వ్యక్తం చేసిన విషయం తెల్సిందే.

ఈ సినిమా కు మూలం ఒక షార్ట్‌ ఫిల్మ్‌ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అధికారికంగానే అంటున్నారు.కిషోర్ రెడ్డి దర్శకత్వంలో దాదాపు అయిదేళ్ల క్రితం వచ్చిన ఆ షార్ట్‌ ఫిల్మ్‌ లోని మూల కథను తీసుకుని ఈ సినిమా ను చేయడం జరిగిందట.

ఆ షార్ట్‌ ఫిల్మ్‌ ను ఉపయోగించి మహర్షి సినిమా లోని సెకండ్‌ పార్ట్‌ ను రూపొందించారట.అందుకే అప్పట్లో యూట్యూబ్‌ నుండి ఆ షార్ట్‌ ఫిల్మ్ ను తొలగించడం జరిగింది.

మహర్షి సినిమా కు లైన్ ను మాత్రమే తీసుకున్నారు కాని శ్రీకారం సినిమా మాత్రం పూర్తిగా తీసేసుకున్నారు.ఒక కమర్షియల్‌ సినిమా హంగులను ఆ షార్ట్‌ ఫిల్మ్‌ కు అద్ది పూర్తి స్థాయిలో శ్రీకారం అన్నట్లుగా విడుదల చేయబోతున్నారు.

వరుసగా సినిమా లు చేస్తున్న శర్వానంద్ ఈ సినిమా తో సక్సెస్ అందుకుంటాడని షార్ట్‌ ఫిల్మ్ సెంటిమెంట్‌ తో కొందరు అంటున్నారు.ఎందుకంటే మహర్షి సినిమా ను ఆ షార్ట్‌ ఫిల్మ్‌ నుండి తీసి సక్సెస్ అయ్యారు.

ఇప్పుడు ఈ సినిమా తో కూడా సక్సెస్‌ దక్కించుకోవడం ఖాయం అంటున్నారు.ఈ రెండు సినిమా లు కూడా ఒకే షార్ట్‌ ఫిల్మ్ నుండి రావడంతో అసలు ఆ షార్ట్‌ ఫిల్మ్‌ ఏమై ఉంటుంది అంటూ నెటిజన్స్‌ సెర్స్‌ చేస్తున్నారు.

కాని ఆ షార్ట్‌ ఫిల్మ్ ఇప్పుడు ఎక్కడ కూడా అందుబాటు లో లేదు.మహర్షి సినిమా విడుదల సమయంలోనే ఆ షార్ట్‌ ఫిల్మ్‌ ను తొలగించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube