ఇకనుండి ఔత్సాహికులు మీమీ FB గ్రూప్స్‌లో ఇష్టమైన 'చానల్స్' సృష్టించుకోండి!

FB (ఫేస్ బుక్) తెలియని మనిషి మనచుట్టూ ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు.అంతలా ఈ సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ జనాల్లోకి దూసుకుపోయింది.

 From Now On Amateurs Can Create Favorite Channels On Your Fb Groups-TeluguStop.com

ఎప్పటికప్పుడు ఈ ఫేస్‌బుక్‌ యాప్ యూజర్ల అవసరాలకు తగ్గట్టు రూపాంతరం చెందుతూ ఉంటోంది.తాజాగా కమ్యూనిటీ గ్రూప్స్ కోసం ‘చానల్స్’ పేరుతో కొత్త ఫీచర్స్ పరిచయం చేసింది.

వీటి ద్వారా గ్రూప్ స్పేస్‌లలో చిన్నపాటి చర్చల కోసం చాట్, ఆడియో, ఫీడ్ వంటి చానల్స్ సృష్టించుకునే అవకాశాన్ని ఈ ఫీచర్ కల్పిస్తుంది.వీటిని ఎఫ్‌బీ గ్రూప్స్‌తో పాటు మెసెంజర్‌లోనూ క్రియేట్ చేసుకోవచ్చు.

వీటి ద్వారా వివిధ గ్రూపులతో సభ్యులు మరింత సులువుగా తమకి ఇష్టమైన వారితో కనెక్ట్ కావచ్చని Facebook చెబుతోంది.కమ్యూనిటీ ఆడియో చానల్స్ విషయానికొస్తే.ఇక్కడ ఛానల్ సృష్టించినవారు, సభ్యులు ఆడియో ద్వారా లోతైన చర్చలు జరుపుకోవచ్చని మెటా పేర్కొంది.ఈ క్రమంలో ఫేస్‌బుక్ కొత్త సైడ్‌బార్‌ను కూడా పరీక్షిస్తున్నట్లు ప్రకటించింది.

ఇది వినియోగదారులు తమ అభిమాన గ్రూప్స్‌ను మరింత త్వరగా కనుగొనడంలో సాయపడుతుంది.మీకు ఇష్టమైన సమూహాలను సైడ్‌బార్ పైభాగానికి పిన్ చేసే అవకాశం కూడా ఇక్కడ కల్పిస్తుంది.

Telugu Chanels, Ups-Latest News - Telugu

దీంతో పిన్ చేసిన మేటర్ హైలైట్ చేయబడుతుంది కాబట్టి అందరికీ తొందరగా కనబడుతుంది.సైడ్‌బార్ యూజర్లకు కొత్త గ్రూప్స్ కనుగొనే లేదా సొంతంగా సృష్టించుకునే సామర్థ్యాన్ని కూడా ఇది అందిస్తుంది.ఈ క్రమంలోనే ఈవెంట్స్, షాప్స్ సహా మరికొన్నింటి లింక్స్ కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి.ఇలాంటి మార్పులు, చేర్పులు వలన సాధారణమైన వారికేకాకుండా వ్యాపారులకు, మిగతా రంగాలవారికి కూడా అనేక లాభాలు వున్నాయి.

కాబట్టి ఈ ఛానల్ అప్షన్ అనేది వినియోగించుకోవాలని FB సూచిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube