అయ్యప్ప మాల, శివ దీక్ష స్వీకరించిన టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో చాలామంది హీరోలు వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటించి పాన్ ఇండియా స్టార్స్ గా గుర్తింపును సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.అయితే టాలీవుడ్ హీరోలలో ఎక్కువమంది హీరోలు అధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉన్నారు.

 From Chiranjeevi To Ram Charan These Tollywood Heroes Took Ayyappa Mala And Shiva Deeksha Regularly-TeluguStop.com

ఎనర్జిటిక్ హీరోగా పేరును సొంతం చేసుకున్న రామ్ పోతినేనికి దైవభక్తి ఎక్కువే కావడం గమనార్హం.

నిజ జీవితంలో మోడ్రన్ గా కనిపించే రామ్ గతేడాది శివ మాల ధరించి వార్తల్లో నిలిచారు.

 From Chiranjeevi To Ram Charan These Tollywood Heroes Took Ayyappa Mala And Shiva Deeksha Regularly-అయ్యప్ప మాల, శివ దీక్ష స్వీకరించిన టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో 100 కోట్ల మార్కెట్ ఉన్న హీరో అయిన చిరంజీవి గతంలో చాలాసార్లు అయ్యప్ప మాల ధరించారు.మరో స్టార్ హీరో రామ్ చరణ్ సైతం ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల ధరిస్తున్నారు.

రామ్ చరణ్ స్నేహితుడు, మిడిల్ రేంజ్ హీరో అయిన శర్వానంద్ కూడా అయ్యప్ప మాల ధరించడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

త్వరలోనే శర్వానంద్ మాల ధారణ చేయనున్నారని తెలుస్తోంది.

యంగ్ హీరో అఖిల్ అక్కినేని సైతం అయ్యప్ప మాల ధరించడాన్ని ఇష్టపడతారు.నాగేశ్వరరావు నాస్తికుడు అయినా అఖిల్ కు మాత్రం దైవభక్తి ఉండటం గమనార్హం.

అధ్యాత్మిక చింతన, దైవభక్తి ఉన్న హీరోలలో మంచు హీరో మంచు మనోజ్ కూడా ఒకరు.అయ్యప్ప మాలను ధరించి మనోజ్ దిగిన ఫోటోలు నెట్టింట గతంలో తెగ వైరల్ అయ్యాయి.

Telugu Ayyappa Mala, Balakrishna, Interesting Facts, Ram Charan, Shiva Deeksha-Movie

అయ్యప్ప మాల ధారణ చేసే హీరోలలో టాలీవుడ్ హీరో రాజేంద్ర ప్రసాద్ కూడా ఒకరు.కొన్ని సంవత్సరాల క్రితం వరకు రెగ్యులర్ గా రాజేంద్ర ప్రసాద్ మాలను ధరించారు.అయితే మరి కొందరు హీరోలు దైవ భక్తి ఉన్నా మాల ధారణకు మాత్రం దూరంగా ఉండటం గమనార్హం. స్టార్ హీరో బాలకృష్ణ, వెంకటేష్ లకు కూడా దైవభక్తి ఎక్కువనే సంగతి తెలిసిందే.

#Ayyappa Mala #Ram Charan #Balakrishna #Shiva Deeksha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube