స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు ఇండస్ట్రీలో రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవాలన్నా, ఆయా హీరోల, హీరోయిన్ల సినిమాలకు రికార్డుస్థాయిలో బిజినెస్ జరగాలన్నా ఆయా హీరోలు, హీరోయిన్లు ఖచ్చితంగా సక్సెస్ లో ఉండాలి.ఈ మధ్య కాలంలో పలువురు హీరోలు ఎంతో కష్టపడుతున్నా వాళ్లకు సరైన సక్సెస్ మాత్రం దక్కడం లేదు.
యంగ్ హీరో రాజ్ తరుణ్ కు కుమారి 21ఎఫ్ తర్వాత ఆ స్థాయి హిట్ లేదు.
తాజాగా రాజ్ తరుణ్ నటించి విడుదలైన అనుభవించు రాజా సినిమా కూడా ఫ్లాప్ గా నిలిచింది.
రాజ్ తరుణ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని అతని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.కథల ఎంపిక విషయంలో రాజ్ తరుణ్ మారాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.న్యాచురల్ స్టార్ నానికి ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేదు.శ్యామ్ సింగరాయ్ సినిమాతో నానికి సక్సెస్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది.
మరో హీరో శర్వానంద్ కు ఈ మధ్య కాలంలో టైమ్ అస్సలు బాలేదు.రిలీజ్ కు ముందు అంచనాలు ఏర్పడుతున్నా సినిమా మాత్రం ఫ్లాప్ అవుతోంది.

ఆడవాళ్లు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం సినిమాలపై శర్వానంద్ ఆశలు పెట్టుకున్నారు.రాక్షసుడు సినిమాతో హిట్ కొట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ కు అల్లుడు అదుర్స్ రిజల్ట్ షాకిచ్చింది.ప్రస్తుతం ఈ హీరో తెలుగులో స్టువర్టుపురం దొంగ మూవీలో నటిస్తున్నారు.

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాపై ఆశలు పెట్టుకున్నారు.ఈ హీరోకు కూడా గత కొన్నేళ్లుగా హిట్లు లేవు.సరైన సక్సెస్ లేని మంచు మనోజ్ అహం బ్రహ్మస్మి సినిమాతో లక్ పరీక్షించుకోనున్నారు.
మంచు విష్ణు నటించిన మోసగాళ్లు ఫ్లాప్ కాగా ఢీ అండ్ ఢీ మూవీపై విష్ణు ఆశలు పెట్టుకున్నారు.లౌక్యం తర్వాత ఆ స్థాయి హిట్ లేని గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమాతో సక్సెస్ వస్తుందని భావిస్తున్నారు.

సోగ్గాడే చిన్నినాయన, ఊపిరి సినిమాల తర్వాత సక్సెస్ లేని నాగార్జున సంక్రాంతికి రిలీజ్ కానున్న బంగార్రాజుతో సక్సెస్ గ్యారంటీ అని నమ్ముతున్నారు.సరైన సక్సెస్ లేని బాలకృష్ణ అఖండతో సక్సెస్ సాధించడంతో పాటు రికార్డులు క్రియేట్ చేస్తానని నమ్ముతున్నారు.