రిలీజ్ డేట్ దొరకక ఇబ్బంది పడుతున్న పెద్ద హీరోల సినిమాలు?

కరోనా కారణం వల్ల ఎన్నో సినిమాలు షూటింగులకు నోచుకోకుండా మధ్యలోనే ఆగిపోయాయి.అయితే ప్రస్తుతం షూటింగ్ నిలిచిపోయిన సినిమాలన్నీ శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకున్నప్పటికీ ఆ సినిమాలను విడుదల చేయడానికి సరైన డేట్స్ దొరకక ఎంతో మంది హీరోలు ఇబ్బంది పడుతున్నారు.

 From Balakrishna Akhanda To Raviteja Khiladi Big Movies Waiting For Release Date-TeluguStop.com

ఒకేసారి సినిమా షూటింగ్ లు అన్నీ పూర్తి కావడంతో స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు సినిమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.అయితే ఒకే రోజు చిన్న హీరోల సినిమాలు రెండు, మూడు సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ పెద్ద హీరోల సినిమాలను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు.

ఇలా సినిమాలు పూర్తి చేసుకొని రిలీజ్ డేట్ దొరకక ఇబ్బంది పడుతున్న సినిమాల విషయానికి వస్తే.బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం అఖండ. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఈ చిత్రం విడుదల గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన తెలియజేయలేదు.దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అంటూ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించినప్పటికీ విడుదల తేదీని ప్రకటించకపోవడం గమనార్హం.

Telugu Akhanda, Balakrishna, Drushyam, Khiladi, Ravi Tej, Tollywood, Venkatesh,

రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం ఖిలాడి. ఈ చిత్రం పరిస్థితి కూడా అలాగే ఉంది.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ విడుదల తేదీని ప్రకటించలేదు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా విజయంలో ఉన్న నాగ చైతన్య తన తదుపరి చిత్రం థాంక్యూ. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఇప్పటి వరుకు విడుదల తేదీని ప్రకటించలేదు.

వీటితో పాటు వెంకటేష్ నటించిన దృశ్యం 2, లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగ శౌర్య రీతువర్మ జంటగా నటించిన వరుడు కావలెను, రానా సాయి పల్లవి జంటగా నటిస్తున్న విరాటపర్వం సినిమాలు కూడా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఈ సినిమాల విడుదల తేదీలను ప్రకటించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube