7 రోజులుగా టాయిలెట్ లోనే క్వారంటైన్ ...!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది.ఇక కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు జనంతో అనేక విన్యాసాలు చేయిస్తోంది.

 From 7 Days Onwards A Person Is In Quarantine At Toilet, Coronavirus, Home Quara-TeluguStop.com

ఇదే తరుణంలోని ఓ వ్యక్తి సొంత ఊరుకు చేరుకొని తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి టాయిలెట్ లోనే క్వారంటైన్ అవ్వడం జరిగింది.కరోనా వైరస్ ఉద్యోగులు కార్మికుల పై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.

దింతో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఉద్యోగస్తులు అందరూ కూడా సొంత ఊర్లకు వెళ్ళిపోతున్నారు.

ఇలా వచ్చిన కొంతమంది ఉద్యోగులను క్వారంటైన్ చేస్తున్నారు స్థానిక అధికారులు.

ఇదే తరుణంలోనే తమిళనాడు రాష్ట్రానికి చెందిన 28 సంవత్సరాల వయసు కలిగిన ఒక ఉద్యోగిని తన సొంత ఊరు ఒడిస్సా కు వెళ్ళాడు.ఇక అతను సొంత రాష్ట్రానికి చేరుకోగానే వారం రోజుల పాటు తన ఇంట్లోనే ఉంచారు ఆ రాష్ట్ర అధికారులు.

ఆ వ్యక్తికి సుదుకాంతి పాఠశాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక వైద్య శిబిరానికి అతని పంపించడం జరిగింది.అయితే అతనికి కరోనా లక్షణాలు ఎలాంటివి కనిపించకపోవడంతో 7 రోజులకే డిశ్చార్జ్ చేయడం జరిగింది.

అలాగే వైద్య అధికారులు 7 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ ఉండాలని తెలియజేశారు.అయితే వారి కుటుంబంలో మొత్తం ఆరుగురు ఉండడంతో తన ఇంట్లో తగినంత స్థలం లేకపోవడంతో టీఎంసీ లో తనకు బసను ఏర్పాటు చేయాలని అడిగారు.

కానీ అధికారులు అందుకు అనుమతించలేదు.ఇక ఇంట్లో మరొక గది లేకపోవడంతో కుటుంబ సభ్యుల రక్షణ కోసం కొత్తగా నిర్మించుకున్న టాయిలెట్ నే అతను క్వారంటైన్ గా మార్చుకోవడం జరిగింది.

దాదాపు టాయిలెట్ లోనే ఏడు రోజుల పాటు గడపాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ అతను తెలియజేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube