పామును మింగిన కప్ప... ఆ తరువాత కప్పకు ఏమైందంటే...?

సాధారణంగా పాములు కప్పలను ఆహారంగా తిని జీవిస్తాయి.కానీ అక్కడ మాత్రం ఒక కప్ప ఏకంగా పామును మింగేసింది.

 Frog Eats Snake-TeluguStop.com

వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ వింత ఘటన రెండు రోజుల క్రితం జరిగింది.టౌన్స్ విల్లే అనే జంతువులకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థ సోషల్ మీడియాలో పామును మింగిన తరువాత కూడా ఆ కప్ప ఆరోగ్యంగా ఉందని చెబుతూ అందుకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసింది.

కప్ప పామును మింగే సమయంలో పాము విడిపించుకోవటానికి ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు.పాము కాటు వేసినప్పటికీ ఆ కప్ప ఇంకా ఆరోగ్యంగానే ఉండటం గమనార్హం.

స్వచ్చంద సంస్థ నిర్వాహకులు కప్ప పామును మింగడం తమను ఎంతో ఆశ్చర్యపరచిందని ఆకుపచ్చ రంగులో ఉన్న కప్ప విషపూరిత పాము అయిన కోస్టల్ తైవన్ ను మింగేసిందని కప్ప బ్రతకదని తాము అనుకుప్పటికీ కప్ప ఆరోగ్యంగానే ఉందని చెబుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలకు 1.7 మిలియన్ లైకులు లక్షల సంఖ్యలో షేర్లు, కామెంట్లు వస్తున్నాయి.నెటిజన్లు ఈ కప్ప నిజంగా లక్కీ ఫెల్లో అని ఇలాంటి కప్ప గురించి తాము ఎప్పుడూ వినలేదని కామెంట్లు చేస్తున్నారు.అంత విషపూరితమైన పామును తిని కూడా ఈ కప్ప బ్రతికిందంటే ఇది మామూలు కప్ప కాదని నెటిజన్లు కామెంట్ల రూపంలో అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube