వింటర్ ఒలింపిక్స్‌ 2022 : చైనా తీరుకు వ్యతిరేకంగా కెనడా- ఇండియా గ్రూప్ నిరసన

చైనా రాజధాని బీజింగ్‌లో వచ్చే ఏడాది జరగనున్న వింటర్ ఒలింపిక్స్ 2022ను బాయ్‌కాట్ చేయాలన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్ణయానికి అంతర్జాతీయ మద్ధతు లభిస్తోంది.ఇప్పటికే పలు దేశాలు ఈ విషయంపై ఆలోచన చేస్తున్నాయి.

 Friends Of Canada-india Protest Against Beijing Winter Olympics In Vancouver , P-TeluguStop.com

మానవ హక్కులను చైనా కాలరాస్తున్నదని అందువల్ల దౌత్యపరంగా వింటర్ ఒలింపిక్స్‌ను బహిష్కరించే అంశాన్ని బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ పరిశీలిస్తున్నారని బ్రిటీష్ మీడియా కథనాలు ప్రచురిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం కెనడాలోని వాంకోవర్‌లో కెనడా- ఇండియా ఫ్రెండ్స్ గ్రూప్ కూడా చైనా తీరుపై తమ నిరసనను తెలియజేసింది.

బీజింగ్‌లో జరగనున్న వింటర్ ఒలింపిక్స్‌కు వ్యతిరేకంగా వాంకోవర్ కన్వెన్షన్ సెంటర్ వద్ద వీరు ప్రదర్శన నిర్వహించారు.హాంకాంగ్ స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.‘ఫ్రీ హాంగ్‌కాంగ్‌’, ‘ఫైట్‌ ఫర్‌ ఫ్రీడమ్‌’, ‘స్టాండ్‌ విత్‌ హెచ్‌కే’ అని రాసి ఉన్న బ్యానర్‌లను పట్టుకుని నినాదాలు చేశారు.సభా వేదిక వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో ఈ కార్యక్రమం విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు.

కాగా.గడిచిన కొన్నేళ్లుగా చైనా తన విస్తరణవాదంతో ఇండో -పసిఫిక్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతోంది.ముఖ్యంగా గ్జింజియాంగ్ ప్రాంతంలో ఉయిగర్ ముస్లింలపై అణచివేతను అమెరికా సహా పలు అంతర్జాతీయ సంస్థలు తీవ్రంగా పరిగణిస్తోంది.దీనితో పాటు గతేడాది జూన్‌లో హాంగ్‌కాంగ్ కోసం వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని చైనా పార్లమెంట్ ఆమోదించింది.

దీని ప్రకారం హాంకాంగ్‌లో ఎటువంటి జాతి వ్యతిరేక కార్యకలాపాలు జరిగినా చైనా ప్రభుత్వానికి కఠిన శిక్షలు విధించే అధికారం లభిస్తుంది.దీనిపై హాంకాంగ్ భగ్గుమంది.

Telugu Canadaindia, China, Freedom, Hong Kong, Friendscanada, Joe Biden, Stand H

ఇక ఇటీవల నెలల్లో తైవాన్‌ను తనలో కలిపేసుకోవాలనే ఉద్దేశ్యంతో చైనా అధినాయకత్వం కయ్యానికి కాలు దువ్వుతోంది.వన్ చైనా విధానంలో తైవాన్ మా దేశంలో అంతర్భాగమే అని బీజింగ్ చెబుతోంది.అయితే తైవాన్ మాత్రం చైనా పెత్తనాన్ని అంగీకరించడం లేదు.ఇటీవల అమెరికా, ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలు తైవాన్‌కు మద్దతు నిలిచాయి.ఈ పరిణామం చైనాకు మింగుడు పడటం లేదు.ఈ నేపథ్యంలోనే చైనాను ఎలాగైనా దారిలోకి తీసుకురావాలని అంతర్జాతీయ సమాజం పావులు కదుపుతోంది.

దానిలో భాగంగానే వింటర్ ఒలింపిక్స్‌ను బాయ్‌కాట్ చేయాలనే నినాదాన్ని ముందుకు తెచ్చింది అమెరికా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube