ఏ పండు తింటే ఏ అనారోగ్యం నయం అవుతుందో తెలుసా?

పండ్లను ప్రతి రోజు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఒక్కో పండు ఒక్కో ప్రయోజనాన్ని కలిగిస్తుంది.

 Fresh Fruits And Their Health Benefits-TeluguStop.com

అయితే ఏ పండు ఏ అనారోగ్య సమస్యను తగ్గిస్తుందో తెలుసా? అలాగే రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు కూడా ఉన్నాయి.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

మామిడి పండు
బాగా పండిన మామిడి పండులో విటమిన్ ఏ,సి ఎక్కువగా లభిస్తాయి.విటమిన్ ఏ ఉండుట వలన జలుబు, సైనసైటిస్‌ సమస్యలు,కంటి సమస్యలు తగ్గుతాయి.అలాగే విటమిన్ సి ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.వయస్సుకు తగ్గ బరువు లేని వారు రోజుకి మూడు సార్లు పాలలో మామిడి రసం కలుపుకొని త్రాగితే బరువు పెరుగుతారు.

అరటిపండు

అరటిపండు తింటే తక్షణ శక్తి లభిస్తుంది.అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన రక్తపోటు అదుపులో ఉంచుతుంది.తద్వారా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

పుచ్చకాయ

పుచ్చకాయలో దాదాపుగా 92 శాతం నీరు ఉంటుంది.

పుచ్చకాయలో ఉండే పొటాషియం, మెగ్నిషియం రక్తపోటును అదుపులో ఉంచి గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది.విటమిన్ బి శరీరానికి శక్తిని ఇస్తుంది.

అంతేకాక ఈ వేసవిలో అధిక వేడి,వడదెబ్బ నుండి కాపాడుతుంది.

జామకాయ

జామకాయలో విటమిన్ సి, కెరాటినాయిడ్స్‌, ఫోలెట్‌, పొటాషియం, పీచు, కాల్షియం, ఐరన్‌ వంటి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి.

జామకాయలో రక్తంలో త్వరగా కరిగిపోయే పీచు అధికంగా ఉండుట వలన కొలస్ట్రాల్ లేకుండా చేస్తుంది.శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి కణజాలం పొరను రక్షించటమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు