మారిన జీవనశైలి, అసమతుల్య ఆహారం, జన్యు పరమైన కారణాలతో ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా అడ, మగ తేడా లేకుండా అందరిలో జుట్టు రాలిపోతుంది.ఈ సమస్య నుండి బయట పడటానికి ఎన్నో చిట్కాలు ఉన్నాయి.ఇవి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.ఉసిరి జుట్టు సమస్యలకు గొప్ప పరిష్కారం.ఉసిరిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండుట వలన జుట్టు కుదుళ్ళ నుండి రిపేర్ చేయటంలో సహాయపడుతుంది.
అయితే ఉసిరిని ఎలా వాడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో వివరంగా తెలుసుకుందాం.
ఉసిరితో ఒక ప్యాక్ తయారుచేసుకోవాలి.వీటికి కావలసిన పదార్ధాల గురించి తెలుసుకుందాం.
రోజ్ వాటర్ జుట్టు కుదుళ్లకు చైతన్యాన్ని కలిగిస్తుంది.కుంకుడు కాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్స్ గాలిలో ఉన్న టాక్సిన్లు మరియు కాలుష్యాల నుండి మీ జుట్టు కుదుళ్ళని కాపాడుతుంది.
కావలసిన పదార్ధాలు
ఉసిరి పొడి – 1 టీస్పూన్ కుంకుడుకాయ పొడి – 1 టీస్పూన్ కర్పూరం పొడి – 1/4 వ టీస్పూన్ రోజ్ వాటర్ – 3 స్పూన్స్
తయారీ విధానం
ఒక బౌల్ లో ఉసిరి పొడి, కుంకుడు కాయ పొడి, కర్పూరం పొడి, రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి.ఈ పేస్ట్ ని తలకు బాగా పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.
ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది.