ఈగను చంపబోయారు ఇల్లంతా తగలబడింది!

కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న పనులకే మనకు ఊహించని నష్టం వచ్చి పడుతుంది.వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికి ఇప్పుడు కూడా రాజమౌళి సినిమాలో ఈగలానే ఉంటుంది ఈ కథ! ఈగ సినిమాలో సమంత, ఈగ కలిసి కిచ్చ సుదీప్ కి ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం చేసినట్టే ఈ ఘటనలో కూడా ఈగను చంపడానికి వెళ్లి భారీగా ఆస్తి నష్టం చేసుకున్నారు.

 Man Blows Up Part Of House While Trying To Kill Fly, French Man,blows Up, Part O-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఫ్రాన్స్ దేశంలోని పార్కౌల్‌-చెనాడ్ గ్రామంలో శుక్రవారం చెందిన ఓ వృద్ధుడు చేసిన పని నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.అసలు అతడు ఏం చేశాడంటే? 80 ఏళ్ల వృద్ధుడు ఈగను చంపడానికి ప్రయత్నించి తన ఇంటినే తగులబెట్టకున్నాడు.అంతే కాదు మంటల్లో స్వల్పంగా గాయాలపాలయ్యాడు కూడా.

నిజానికి ఆ ఈగ కూడా అతన్ని చాలా దారుణంగా ఇబ్బంది పెట్టిందట.అతను ఇంట్లో సైలెంట్ గా కూర్చొని అటు ఇటు చూస్తుండగా అతని వద్దకు ఈగ వచ్చింది.

దాన్ని వెళ్లగొట్టాలని ఎంత ప్రయత్నించిన అది పోకుండా అతని చుట్టూనే తిరుగుతూ విసిగిస్తుంది.దీంతో అతనికి కోపం వచ్చింది.ఇంకేముంది నీ పని చెప్తా అంటూ దోమల్ని చంపే ఎల‌క్ట్రిక్ బ్యాట్‌ తీసుకున్నాడు.

ఈగ ఎక్కడ ఉందా అని వెతుకుతున్నాడు.

ఎక్కడ కనిపించలేదు.దీంతో ఇల్లంతా వెతుకుతూ అతను వంట గదిలో అడుగుపెట్టాడు.

అక్కడ ఈగ కనిపించడంతో ఆ వృద్ధుడు ఒక్కసారిగా ఎలెక్ట్రిక్ బ్యాట్ తో దాన్ని కొట్టాడు.అది చచ్చిందో లేదో తెలియదు కానీ ఇల్లు మాత్రం మంటల్లో బూడిదయ్యింది.

ఎందుకంటే ఈగను చంపాలి అనే ఆలోచనలో అతడు గ్యాస్ లీక్ అవుతున్నది పట్టించుకోలేదు.అలానే ఎలెక్ట్రిక్ బ్యాట్ నుంచి వచ్చిన స్పార్క్ తో ఇల్లు అంత తగలబడింది.

అయితే వృద్ధుడు మాత్రం అదృష్టవశాత్తు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube