ఫ్రాన్స్ లో పురుషులకి వయాగ్రా! కారణం ఎంతో కచ్చితంగా తెలుసుకోవాల్సిందే

ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరిగిపోతుంది అని, ముఖ్యంగా ఇండియా, చైనాలాంటి దేశాలలో పెరిగిపోతున్న జనాభాతో ఆర్ధిక సమతౌల్యత దెబ్బ తినకుండా ఉండటం కూడా ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ విధానం అమల్లోకి తీసుకొచ్చి ఇద్దరు చాలు, ముగ్గురు వద్దు అనే నినాదం ప్రజల్లోకి తీసుకెళ్ళింది.దీంతో చాలా మంది ఇద్దరు పిల్లలకి పరిమితం అవుతున్నారు.

 French Town Offers Free Viagra To Boost Birth Rate-TeluguStop.com

ఇక చైనాలో అయితే ఒక్కరిని మించి కనకూడదు అనే రూల్ కూడా మొన్నటి వరకు నడిచింది.అయితే అమెరికా, ఫ్రాన్స్ లాంటి దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుంది అనే టెన్షన్ పడుతున్నారు.

జనాభా పెంచడం కోసం కొత్త కొత్త విధానాలని ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తుంది.

ఫ్రాన్స్ దేశంలో అయితే జనాభా భారీగా తగ్గిపోతూ ఉండటంతో పాటు వృద్ధుల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతోంది.

ముసలివారికి పెన్షన్లు ఇవ్వలేక ప్రభుత్వం చేతులెత్తేస్తోంది.మరోవైపు పుట్టిన పిల్లల సంఖ్య తగ్గిపోవడంతో కిండర్ గార్డెన్ స్కూల్స్ లో చేరేందుకు పిల్లలు లేక స్కూళ్లను మూయాల్సిన పరిస్థితి వస్తోంది.

ఈ పరిస్థితి గమనించిన మాంటిరో నగర మేయర్ పిల్లలను కనాల్సిందిగా ప్రజలని ప్రోత్సహిస్తున్నారు.దీనికోసం దంపతులు బిజీ లైఫ్ లో పడి లైంగిక సుఖానికి దూరమవుతున్నారని గమనించి, పురుషులందరికి వయాగ్రాలు ఉచితంగా అందించే పథకాన్ని ప్రారంభించాడు.

అంతేకాదు పిల్లలను లేని దంపతులు మరోసారి హనీమూన్ వెళ్లేందుకు ప్రత్యేక సెలవలు, అలాగే బోనస్ కూడా ఇవ్వాలని నగరంలోని కార్యాలయాలను ఆదేశించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube