మాస్క్ పెట్టుకోమంటే.. ప్రాణం తీశారు!?  

French bus driver dies after attack over mask-wearing rules, French bus driver ,Mask, Passengers - Telugu French Bus Driver, French Bus Driver Dies After Attack Over Mask-wearing Rules, Mask, Passengers

కాలం చాలా అన్యాయంగా మారిపోయింది.ఈ కాలంలో మంచి చెప్పిన తప్పే.

 French Bus Driver Brain Dead Mask Issue

ఇంకా అలాంటి ఘటనే ఫ్రాన్స్‌లోని బయోన్నెలో చోటుచేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.59 ఏళ్ల ఫిలిప్పే మంగీల్లాట్ అనే వ్యక్తి వృత్తి రిత్యా బ‌స్ డ్రైవ‌ర్‌గా పనిచేస్తున్నాడు.ఇంకా ఈ నేపథ్యంలోనే గత వారం అతను నడుపుతున్న బస్సులోకి ముగ్గురు వ్య‌క్తులు ఎక్కారు.

అయితే ఆ ముగ్గురు వ్యక్తులు మాస్కులు ధరించలేదు.దీంతో అతను మాస్కులు ధరించండి అంటూ ఆ ముగ్గురు యువకులకు చెప్పాడు.వినకపోవడంతో మీరు మాస్కు ధరించకపోతే బస్సు ముందుకు కదలదని ఇక్కడే దింపేస్తానని చెప్పాడు.దీంతో కోపానికి గురైన ఆ ముగ్గురు ఫిలిప్పేపై ఇనుప‌రాడ్‌తో విచ‌క్ష‌ణార‌హితంగా కొట్టిపారిపోయారు.

మాస్క్ పెట్టుకోమంటే.. ప్రాణం తీశారు-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఆ ముగ్గురు కొట్టిన సమయంలో అతనికి త‌ల‌కు బ‌ల‌మైన గాయం కావ‌డంతో అప‌స్మార‌క స్థితిలోకి వెళ్ళిపోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.అయితే అతనికి చికిత్స చేసిన డాక్టర్లు తలకు బలమైన గాయం కావడం వల్ల బ్రెయిన్ డెడ్ అయింద‌ని పేర్కొన్నారు.శుక్రవారం అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు.

అయితే దాడికి పాల్ప‌డ్డ ముగ్గురు వ్య‌క్తుల‌పై మ‌ర్డ‌ర్ కేసు నమోదు చేసినట్టు వారికోసం గాలిస్తున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.ఏది ఏమైనా ఈ కాలంలో ఎవరి పని వారు చూసుకోవడం మంచిది.

మంచి చెయ్యడానికి వెళ్లిన మనకే చేటు అని ఈ ఘటన నిరూపించింది.

#Mask #Passengers

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

French Bus Driver Brain Dead Mask Issue Related Telugu News,Photos/Pics,Images..