అక్కడ పెళ్లి చేసుకుంటే జీతం ఇస్తారట... ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు

తెలుగు రాష్ట్రాల్లో ఆడవారికి ప్రభుత్వాలు ఎలాంటి తాయిలాలు ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.నెల నెల ఏదో ఒక రూపంలో ప్రభుత్వం వారు మహిళలకు అమౌంట్‌ వేయడం జరుగుతుంది.

 Free Salary For Non Working Kuwaiti Women To Avoid Divorce1 1-TeluguStop.com

ఆ మద్య చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ అంటూ మహిళలకు అమౌంట్స్‌ ఇవ్వడం జరిగింది.అయితే కువైట్‌లో మాత్రం పెళ్లి చేసుకున్న ప్రతి మహిళకు కూడా భారీ మొత్తంలో ప్రభుత్వం జీతం ఇచ్చినట్లుగా నెల నెల డబ్బులు ఇవ్వడం జరుగుతుంది.

కువైట్‌లో ప్రారంభం అయిన ఈ వింత పద్దతి ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.కువైట్‌లో అక్రమ సంబంధాలు మరియు విడాకులు ఎక్కువ అవుతున్నాయి.వాటిని అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కొత్తగా పెళ్లి అయిన ఆడవారికి ప్రభుత్వం నుండి నెల నెల ఉద్యోగినికి వచ్చినట్లుగా డబ్బు వస్తుంది.

అందుకు గాను ప్రభుత్వం కొన్ని కండీషన్స్‌ పెట్టింది.ఆ కండీషన్స్‌కు లోబడి ఉన్న వారు మాత్రమే ప్రభుత్వం ఇచ్చే జీతంకు అర్హులు.

అక్కడ పెళ్లి చేసుకుంటే జీతం ఇ

ప్రభుత్వ సంస్థ లేదా ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేయక పోవడంతో పాటు, ఏదైనా వ్యాపారా సంస్థని నిర్వహించని వారికి మాత్రమే ఈ ప్రభుత్వ జీతం వస్తుందట.ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత అతడితోనే జీవితం గడపాలని, రెండవ పెళ్లి చేసుకునే ఆలోచన వస్తే ఆ జీతం వారికి ఇవ్వబడదు అంటున్నారు.మొదటి భర్తతో హ్యాపీగా జీవితాన్ని గడిపే ఆడవారికి ఈ జీతం డబ్బులు వస్తాయి.మొత్తానికి కువైట్‌ తీసుకున్న ఈ నిర్ణయం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube