సన్నీ లియోన్ కి కావాల్సినంత పబ్లిసిటి దొరికింది

భూపేంద్ర చౌబే .ఈ పేరు ఎప్పుడైనా విన్నారా ? మీకు జాతీయ న్యూస్ ఛానెల్స్ చూసే అలవాటు ఉంటె చెప్పాల్సిన పనే లేదు.అలా తెలియకపోయినా, రెండు మూడు రోజులుగా సన్నీ లియోన్ ఇంటర్వ్యు వివాదం గురించి ఏదైనా వార్త చదివారా ? ఆ ఇంటర్వ్యూ చేసింది ఈ మహానుభావుడే, ఇలాగైనా తెలిసిందా ? నేషనల్ న్యూస్ ఛానెల్ ఐ.బి.ఎన్ లో ఈయన సీనియర్ జర్నలిస్టు.చాలా అనుభవం, మంచి పేరు సంపాదించి, ఇప్పుడు అందరి తిట్లు పడుతున్నాడు.

 Free Publicity For Sunny Leone-TeluguStop.com

ఎందుకు అనేది ఇంకా అర్థం కాకపొతే వెంటనే ఇక్కడ ఆ సన్నీ లియోన్ ఇంటర్వ్యు చుసేయ్యండి –

పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసాడు.ఇంటర్వ్యు చేయడానికి పిలిచాడో,లేక అవమానించడానికి పిలిచాడో అర్థం కాదు.

సన్నీ లియోన్ వల్లే దేశంలో పోర్న్ చూసేవాళ్ళు పెరిగారు అంటాడు, ఆడవాళ్ళు తమ మొగుళ్ళని సన్నీ తీసుకుపోతుంది అని భయపడుతున్నారని అంటాడు.మీతో పెద్ద హీరోలు సినిమాలు చేయాలనుకోవట్లేదట, అమీర్ ఖాన్ మీతో సినిమా చేస్తాడా ? ఎందుకు చేయడు ? మీరూ ఆమీర్ ని అభిమానించడం మానేస్తారా ? మీ వల్ల దేశానికి ప్రమాదం అంటున్నారు .ఇలా మామూలు నస కాదు బాబోయ్.సన్నీ మంచిది కాబట్టి అన్నిటికి నవ్వుకుంటూ సమాధానం చెప్పింది.

తన నవ్వుతో అందరి మనసుల్ని దోచుకుంది.

ఒక్క ఇంటర్వ్యు వల్ల సన్నీని లక్షలమంది అభిమానించడం మొదలుపెట్టారు.

సానుభూతితో వచ్చే బలం అదే.చివరకి ఆమీర్ ఖాన్ కుడా నీతో సినిమా చేయాడానికి ఏమాత్రం అభ్యంతరం లేదు సన్నీ అని ప్రకటించే దాకా వెళ్ళింది.దేశవ్యాప్తంగా ఏ చానెల్ చుసినా సన్నీ గురించే చర్చ.ఏది ఏమైనా సన్నీకి ఫ్రీ పబ్లిసిటి దొరికింది.ఈ నెల 29న తన కొత్తచిత్రం మస్తిజాదే విడుదల కానుండటంతో ఈ సానుభూతి బాగా పనికొస్తుందేమో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube