ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. స్టూడెంట్స్ కు ప్రతిరోజు 2 జిబి డేటా ఫ్రీ..! అసలు మేటర్ ఏంటంటే..!

ఈ కాలంలో చిన్నపిల్లలు, కుర్రాళ్ళు, ముసలివాళ్ళు అనే తేడా లేకుండా అందరూ ఫోన్ చూడడానికి అలవాటు పడిపోయారు.ఫోన్ చూడాలంటే ముందుగా కావలిసింది ఇంటర్ నెట్.

 Free, Data Plans, Tamil Nadu, Election's, Students Online Clases, Internet, Tami-TeluguStop.com

ఫోన్ లో డేటా లేకపోతే ఏమి చూడలేము కదా.సరే ఉన్న డేటా తో ఏదన్నా సినిమా చూద్దామని సినిమా చూస్తుంటే మధ్యలో డేటా ఆయిపోతుంది.మళ్ళీ కొత్తగా డేటా రావాలంటే మరుసటి రోజు వరకు ఆగాలిసిందే.అయితే ఇప్పుడు చెప్పబోయే శుభవార్త వింటే మీరు పండగ చేసుకుంటారు తెలుసా.అది ఏంటంటే స్టూడెంట్స్ కి ఇకమీదట 2జిబి డేటా ఫ్రీ గా వస్తుంది.కాక‌పోతే ఈ ఆఫర్ మన రాష్టంలో కాదండోయ్.! మ‌న ప‌క్క రాష్ట్రం త‌మిళ‌నాడులో కేవలం స్టూడెంట్స్ కి మాత్రమే.

రెండు జీబీల డేటా ఫ్రీగా ఇస్తోంది అక్కడ స‌ర్కార్.దీంతో వాళ్ళ పంట పండిందే అని అనుకోకండి.దానికి కూడా షరతులు వర్తిస్తాయి.

ఈ డేటా కేవలం ఒక్క ఆన్ లైన్ క్లాసులు ఉన్న వాళ్ల‌కి మాత్ర‌మే వర్తిస్తుంది.అంటే వాళ్ళకి రెండు జీబీల డేటా ఫ్రీగా ఇస్తోంది.

ఈ రోజే త‌మిళ‌నాడు సీఎం ప‌ళని స్వామి ఈ అనౌన్స్మెంట్ చేశారు.ప్ర‌భుత్వ‌, ఎయిడెడ్ ఆర్ట్స్ ఎండ్ సైన్స్ కాలేజీల్లో చ‌దివే స్టూడెంట్స్ తో పాటు.

పాలిటెక్నిక్, ఇంజ‌నీరింగ్ స్టూడెంట్స్ కి కూడా డైలీ 2 జీబీ డేటా ఇస్తార‌ట‌.జ‌న‌వ‌రి ఒక్క నెలే కాదు.

ఈ అవకాశం ఏప్రిల్ దాకా ఇస్తార‌ట‌.మొత్తం 9 నుంచి 10 ల‌క్ష‌ల మందికి డేటా ఫ్రీ వస్తుంది.

ఈ డేటా కార్డుల్ని.ఎల‌క్ట్రానిక్ కార్పొరేష‌న్ అఫ్ త‌మిళ‌నాడు లిమిటెడ్ ద్వారా ఇస్తార‌ట‌.

Telugu Polytechnic, Tamil Nadu, Tamilnadu-Latest News - Telugu

అయితే మేం ఆన్ లైన్ క్లాసులు వింటాము అని కార్డులు తీసుకుని దానిలోని డేటా మొత్తం మాకు ఇష్ట‌మొచ్చిన‌ట్లు వాడుకున్న పర్వాలేదట.అక్క‌డ రిస్ట్రిక్ష‌న్స్ లేవట.కేవలం స్టూడెంట్స్ ని ఆకర్షించడానికి ఈ ప్లాన్ అంటున్నారు కొంతమంది.ఎందుకంటే మార్చి ఏప్రిల్ లో త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎల‌క్ష‌న్ ఉంది క‌దా.అందుకే.ఇలా ప్లానేసి.

ఓట్లు కొట్టేయాల‌ని చూస్తున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఇలా చేయడం అనేది స్టూడెంట్స్ కి ఉపయోగమే కదా.ఎందుకంటే వాల్లైన డేటా కోసం ఫోన్లో బిల్ కట్టాలిసిందే.ఈ ఫ్రీ డేటా వాళ్ళ కొంతమంది మనీ సేవ్ అయినట్లే అని కొంతమంది స్టూడెంట్స్ అభిప్రాయ పడుతున్నారు.

ఇక రాబోయే 4 నెలల పాటు తమిళనాడులో స్టూడెంట్స్ జోరుని ఆపలేమన్నమాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube