వెంకన్న స్వామి భక్తులకు తీపి కబురు..!

తిరుమల తిరుపతి వెంకన్న స్వామి భక్తులకు శుభవార్త.ఉచిత దర్శనం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి ఉచిత దర్శనాన్ని మొదలుపెట్టింది టీటీడీ.

 Ttd, Tirumala, Loard Venkeswara Swamy, Free Darshan-TeluguStop.com

ఇందుకు సంబంధించి తాజాగా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో సోమవారం ఉదయం సామాన్య భక్తులకు మూడు వేల ఉచిత దర్శనం టోకెన్లను జారీ చేసింది.దీంతో శ్రీవారి భక్తులకు ఎంతో మేలు చేకూరుతుంది.

భూదేవి కాంప్లెక్స్ లో ఉదయం 5 గంటల నుండి ఉచిత టోకెన్లను జారీచేస్తుంది టీటీడీ.దర్శనం టోకెన్లను పొందిన భక్తులకు మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు.


లాక్ డౌన్ తర్వాత జూన్ 11 నుంచి తిరుమల దర్శనం తిరిగి ప్రారంభం అయ్యాయి.ఇందులో భాగంగా మొదట్లో గంటకు 500 మంది భక్తులు చొప్పున రోజుకు కేవలం ఆరు వేల మందికి మాత్రమే దర్శనాన్ని కల్పించేలా చర్యలు చేపట్టారు.

ఆ తర్వాత 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు 3000, అలాగే మూడు వేల మందికి సర్వదర్శన టికెట్లు అందజేశారు.ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆ టికెట్లు కూడా తొమ్మిది వేలకు, ఆపైన మళ్లీ వాటిని రోజుకు 12000 మందికి టోకెన్లను విడుదల చేసింది టీటీడీ.

అయితే 12000 టోకన్స్ ను భక్తులు పూర్తి స్థాయిలో కొనుగోలు చేసినా కానీ స్వామిని దర్శించుకునే భక్తులు మాత్రం కాస్త తక్కువగా ఉన్నట్లు కనబడుతోంది.ఓ వైపు చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటం తిరుపతి లోని కొన్ని ప్రాంతాలను కంటోన్మెంట్ గా ప్రకటించడంతో ప్రజలు దర్శనం చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు.

ఇంతక ముందు తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లో సర్వ దర్శనం టిక్కెట్ల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.అయితే ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో భక్తులు ఒకానొక దశలో ఆందోళనకు గురయ్యారు.300 రూపాయల కోటాను రోజురోజుకీ పెంచుకుంటూ వెళ్ళిన టిటిడి అయితే ఆ తర్వాత ఉచిత దర్శనం పై మాత్రం దృష్టి సాధించలేదు.దీంతో టిటిడి అధికారులు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఈ విషయంలో టిటిడి కేవలం ఆదాయం కోసమే ఉచిత దర్శనం ఇవ్వలేదని ఆరోపణలు వచ్చాయి.ఇకపోతే ఎట్టకేలకు సర్వదర్శనం టికెట్లు పునరుద్ధరించడం ప్రజలకు మంచి విషయమే అని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube