నగరంలో ఫ్రీ క్యాబ్ ఫెసిలిటీ.. వారికి మాత్రమే.. ?

ఈ కరోనా సమయంలో మానవ దృక్పదంతో సోషల్ సర్వీస్ చేసే వారు కొందరైతే, అందిన కాడికి దోచుకుంటున్న వారు మరికొందరు ఉన్నారు.నాకేంటి లాభం అనే ధోరణి స్వార్ధంతో కలిసిపోయింది.

 Free Cab Services For Pregnant Woman, Covid, Lockdown,free Cab Facility, Pregnan-TeluguStop.com

ఫలితంగా ప్రస్తుతం సమాజంలో దోపిడి ఎక్కువైంది.

ఇక అక్కడక్కడ మంచి చేసే వారు కూడా ఉన్నారు.

కానీ వీరు అంత త్వరగా గుర్తించబడరు.ఇకపోతే నగరంలో కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో కొందరికి చాలా ఇబ్బంది ఎదురవుతున్న విషయం తెలిసిందే.

ముఖ్యంగా గర్భిణి స్త్రీలకు ఇబ్బంది తీవ్రంగా ఉంది.ఏదైన సమస్య వచ్చినప్పుడు హస్పటల్‌కు వెళ్లుదాం అంటే క్యాబ్స్ దొరకడం లేదు.

ఈ నేపధ్యంలో క్యాబ్ డ్రైవర్ల అసోసియేషన్ ముందుకు వచ్చింది.

గర్భిణులకు హెల్త్ చెకప్​లు, అత్యవసరంగా హాస్పిటల్స్ కు తరలించేందుకు ఫ్రీ క్యాబ్ సర్వీసును మొదలు పెట్టినట్లుగా ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ సల్లావుద్దీన్ తెలిపారు.

కాగా క్యాబ్ అవసరం అయిన వారు +91-9177624678 నంబర్ కు సంప్రదించి క్యాబ్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు.ఇకపోతే ప్రస్తుతం సిటీలో 5 క్యాబ్ లు అందుబాటులో ఉన్నాయని, అవసరం ఉన్న వారు నగరంలోని ఏ మూల నుండైన ఈ సేవలు పొందవచ్చని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube