ఫ్రీగా బస్ ప్రయాణం ! అమలుచేయబోతున్న ఆ దేశం  

మనం బస్ ఎక్కాలంటే ముందుగా కావాల్సింది డబ్బులు. డబ్బులు ఉంటేనే బస్సులో ప్రయాణం సాధ్యమవుతుంది. మనం ప్రయాణించే ప్రాంతానికి నిర్ణీత సొమ్ము చెల్లించి టికెట్ కొంటూ ఉంటాము. అలా కాకుండా ప్రయాణిస్తే కండక్టర్ కి కోపం వచ్చి మనల్ని నిర్ధాక్షిణ్యంగా దించేస్తాడు. కానీ ఓ దేశం లో అటువంటి ఛాన్స్ ఉండదట. ఎందుకంటే..? అక్కడ అందరికి బస్ ప్రయాణం ఉచితం చేసేస్తున్నారు.

Free Bus Travel! The Country That Will Be Implemented-

Free Bus Travel! The Country That Will Be Implemented

యూరప్ లోని లక్జంబర్గ్ దేశంలో అందరికి ఉచితంగానే ప్రయాణం చేసే అవకాశం కల్పించాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. 2020 నాటికి ఈ విదానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని వెల్లడించారు. దేశంలో కాలుష్యాన్ని నియంత్రించడానికి గాను ఈ ఆలోచన చేస్తున్నారట. టిక్కెట్ ఉండదంటే అంతా పబ్లిక్ ట్రాన్స్ పోర్టుపై ఆదారపడతారన్నది వారి ఆలోచన అట. కానీ ఇది ఎంతవరకు అమలవుతుందో చూడాలి.