వైరల్ వీడియో: రోడ్డుపై వింత జంతువు సంచారం!

ఇటీవల కాలంలో ఎన్ని రకాల వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయో చెప్పాల్సిన పని లేదు.రోజుకో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చింది.

 Robot Dog Walking Down Street Viral Video, Freaky Video, Robot Dog, Street, Vira-TeluguStop.com

ఇక ఇప్పుడు కూడా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.అదే వింత జంతువు రోడ్డుపై తిరుగుతుంది.

గతంలో లాక్ డౌన్ ఉన్న సమయంలో అడవిలో ఉండే జంతువులు అన్ని రోడ్డుపైకి వచ్చి సందడి చేసాయ్.ఇప్పుడు కూడా అంతే ఓ వింత జంతువు లాక్ డౌన్ తర్వాత కూడా అలానే రోడ్డుపై తిరుగుతూ నెట్టింట వైరల్ అవుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.కెనడాలోని అంటారియో వీధిలో ఎప్పుడూ చూడనటువంటి వింత జంతువు రోడ్డుపైకి రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.అయితే కాసేపటికి విషయం తెలుసుకున్న ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.అది వింత జంతువు కాదు, మనిషి తయారుచేసిన రోబో డాగ్ అని.

ఈ రోబో డాగ్ పేరు స్పాట్ దీనిని బోస్టన్ డైనమిక్ అనే రోబోటిక్స్ సంస్థ రూపొందించింది.

ఈ స్పాట్ రోబో గొర్రెల కాపరిగా పనిచేయడంతో పాటు కెనడాలోని అంటారియో వీధులలో ప్రజలను సామాజిక దూరం పాటించాలంటూ అప్రమత్తం చేస్తుంది.

ఈ డాగ్ రోబోట్ చూసిన ప్రజలు మొదట్లో భయపడిన, తరువాత ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు.అయితే ఈ డాగ్ రోబోట్ వెనుక ఒక వ్యక్తి ఆపరేట్ చేస్తూ ఉన్నాడు.

ఈ వీడియో చూసిన కొనసావే అనే వ్యక్తి రోబో డాగ్ ఆపరేట్ చేస్తున్న వ్యక్తి అనుమతి తీసుకొని వీడియో తీశాడు.

అయితే ఆ వ్యక్తి ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా అది ఇప్పుడు వైరల్ గా మారింది.

అయితే వీడియో పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే ఎంతో మందిని ఆకర్షించింది.ఎంతోమంది ఈ వీడియోను రీ-ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చెక్కర్లు కొడుతుంది.మరి మీరు ఓసారి ఈ వీడియో చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube