రైతులను వంచిస్తున్న కల్తీ మోసగాడు.. ?

కొందరికి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య ఈ అలవాటు వల్ల అమాయకులను తేలికగా బుట్టలో వేసుకుంటారు.ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.

 Mancherial, Madaaram, Fraudster, Cheating, Farmers , Fraudster Cheating Farmers-TeluguStop.com

ఆ వివరాలు చూస్తే.రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి, మంచిర్యాల జిల్లా, మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలో, కల్తీ నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా ప్రాంతం నుండి, గోరంట్ల సురేష్ అనే వ్యక్తి వద్ద, తక్కువ ధరకు కల్తీ విత్తనాలు తీసుకు వచ్చిన బిక్షపతి అనే మోసగాడు, మంచిర్యాల జిల్లాలోని రైతులకు నిజమైన, ప్రభుత్వ ఆమోదిత పత్తి విత్తనాలుగా నమ్మించి రైతులను మోసం చేస్తున్నాడట.

ఈ వైట్ కాలర్ నేరస్తుడి పై, 2019 నుండి 2020 సంవత్సరం వరకు మంచిర్యాల జిల్లాలోని, మాదారం పోలీస్ స్టేషన్ లలో రెండు కేసులు, మరియు రెబ్బెన పోలీస్ స్టేషన్ 01 కేసు నమోదు అయిందట  ఇతను అమాయక రైతులకు కల్తీ, పత్తి విత్తనాలు సరఫరా చేస్తూ, అక్రమంగా డబ్బులు సంపాదించటం వంటి నేరాలకు పాల్పడుతున్న క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube