వరంగల్ జిల్లాలో పెరుగుతున్న ఘరానా మోసాలు. లక్షలు కొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లు..!

అమాయక ప్రజలను మోసం చేయడానికి అన్ని దారులు తెరిచి ఉంచారు సైబర్ నేరగాళ్లు.వివిధ రకాల ఆఫర్లు, తక్కువ పెట్టుబడి కి ఎక్కువ లాభాలు, ఫ్రీ గిఫ్ట్లు, భారీ డిస్కౌంట్ లాంటి వాటితో ప్రజలను మోసం చేసి ఏకంగా లక్షల్లో డబ్బులు కాజేస్తున్నారు.

 Frauds Are Increasing In Warangal District.. Cyber ​​criminals Are Making La-TeluguStop.com

అంతేకాకుండా ఉద్యోగాలంటూ, క్రెడిట్, డెబిట్ కార్డ్ లాంటి వాటితో వివరాలు సేకరించి క్షణాల్లో ఖాతాలోని డబ్బును స్వాహా చేస్తున్నారు.ప్రభుత్వ యంత్రాంగం, సైబర్ క్రైమ్( Cyber crime ) అధికారులు ఒకపక్క ఎంత అవగాహన కల్పిస్తున్న కూడా.

మరొకపక్క సైబర్ నేరాల సంఖ్య భారీగా పెరుగుతూ పోతోంది.వరంగల్ జిల్లాలో చాలా సులువుగా బురిడీ కొట్టించి సులువుగా డబ్బు కాజేశారు.

వరంగల్ లోని ( Warangal district )సుబేదారి ఠాణా పరిధిలో ఓ రిటైర్డ్ అధికారికి, గుర్తు తెలియని వ్యక్తి నుండి ఫోన్ వచ్చి మీ బ్యాంకు కార్డు సమయం ముగిసింది వెంటనే అప్డేట్ చేయాలి.మీ ఫోన్కు ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది అది చెప్తే చాలు అనడంతో, ఆ రిటైర్డ్ అధికారి ఓటీపీ చెప్పడంతో ఖాతా నుండి రూ.85000 క్షణాల్లో మాయం చేశారు.

అంతేకాకుండా కాజీపేట వెంకటాద్రి నగర్ లో ఉండే ఓ వ్యక్తికి ఫోన్ చేసి కేవైసీ అప్డేట్ చేయాలి.మీ ఫోన్ కు వచ్చే ఓటిపి చెప్తే సరిపోతుంది అనడంతో, ఆ వ్యక్తి ఓటీపీ చెప్పిన వెంటనే రూ.25000 వెంటనే బదిలీ అయ్యాయి.ఇంకా కాజీపేట లో మరో వ్యక్తికి ఫోన్ చేసి క్రెడిట్ కార్డ్ పరిమితి పెంచుతామంటూ ఒక లింక్ పంపించారు.లింక్ ఓపెన్ చేయగానే క్షణాల్లో 1.11 లక్షలు బదిలీ అయ్యాయి.

హన్మకొండ( Hanmakonda _ కు చెందిన ఓ వ్యాపారికి తక్కువ ధరకు కార్ ఇప్పిస్తామని, కార్ యజమాని విదేశాలకు వెళ్తూ కారు అమ్ముతున్నాడని చెప్పి రూ.2 లక్షలు కొట్టేశారు కొట్టేశారు.ఎట్టి పరిస్థితులలో ఓటీపీలు ఇతరులకు చెప్పకూడదు.

తెలియని వ్యక్తుల నుండి వచ్చిన లింక్స్ ఎట్టి పరిస్థితులలో క్లిక్ చేయకూడదు.అనుమానం వస్తే పోలీసులకు సమాచారం అందించాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube