అమెరికాలో ఘరానా మోసం..ఊచలు లెక్కిస్తున్న భారత సంతతి యువకుడు..!!

అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయులంటే పట్టువదలని విక్రమార్కులు అనే స్థాయిలో అమెరికన్స్ లో మనమీద అంచనాలు ఉంటాయి.ఎంతో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, తెలివైన వాళ్ళుగా అమెరికాలో మనం సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాం.

 Fraud In America Indian Origin Young  Man  Arrested In Ppe Kit Scam , America, I-TeluguStop.com

కేవలం విద్యా, వైద్య ఆర్ధిక ఇలా అనేక రంగాలలో మాత్రమే కాకుండా రాజకీయ రంగంలో సైతం అమెరికన్స్ కు పోటీగా మన భారత సంతతి వ్యక్తులు సేవలు అందిస్తున్నారు.అయితే తులసి వనంలో గంజాయి మొక్కల్లా అక్కడక్కడా కొందరు భారత సంతతి వ్యక్తులు ఎన్నో తప్పిదాలు చేస్తూ కటకటాల పాలయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.

తాజాగా

అమెరికాలోని కొందరు అమెరికన్స్ ను మోసం చేసిన ఘటనలో భారత సంతతి వ్యక్తిని కటినంగా శిక్షించింది అమెరికా కోర్టు.అసలేం జరిగిందంటే.

అమెరికాలో కరోనా ఎలాంటి విపత్కర పరిస్థితులను సృష్టించినదే అందరికి తెలిసిందే.ఈ పాండమిక్ ను అడ్డుపెట్టుకుని ఎన్నో మోసాలు చేసిన వారు కూడా ఉన్నారు.

అలాంటి వారిలో ఒకరు భారత సంతతికి చెందిన 25 ఏళ్ళ గౌరవ్ జిత్ సింగ్.తాను చేసిన తప్పులను సాక్ష్యాలతో సహ పోలీసులు బయటపెట్టడంతో చేసేంది లేక కోర్టు ముందు బావురుమని చేసిన తప్పులను ఒప్పేసుకున్నాడు.

Telugu America, American, Corona, Indian Origin, Jersey, Ppe Kit Scam-Telugu NRI

పోలీసుల కధనం ప్రకారం.న్యూజెర్సీ రాష్ట్రానికి చెందిన గౌరవ్ జిత్ సింగ్ కరోనా నుంచీ రక్షణ పొందే PPE కిట్లు సరఫరా చేసే డీల్ ను అమెరికాలోని కొందరితో మిలియన్ డాలర్లతో డీల్ కుదుర్చుకున్నాడు.ఇలా మొత్తం 7.1 మిలియన్ డాలర్ల ఒప్పందాలు కుదుర్చుకున్న గౌరవ్ జిత్ సింగ్ సుమారు 10 మంది అమెరికన్స్ నుంచీ దాదాపు 2 మిలియన్ డాలర్ల డబ్బును తన ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు.అయితే ఒప్పందం ప్రకారం కిట్స్ ను పంపక పోగా మిగిలిన డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని ఒత్తిడి చేయడంతో సందేహించిన అమెరికన్స్ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు.పోలీసులు విచారణ చేసి కేసు నమోదు చేసే సమయానికి అతడి చాలా డబ్బు ఖర్చు చేయడంతో పక్కా సాక్ష్యాదారాలతో అతడిని కోర్టు ముందు ప్రవేశపెట్టగా కోర్టు అతడికి 4 ఏళ్ళ జైలు శిక్షతో పాటు విడుదల అయిన తరువాత 3 ఏళ్ళు పాటు పోలీసులు అతడి కదలికలను గమనిస్తుండాలని ఆదేశించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube