ఫ్రాన్స్‌లో కృష్ణా జిల్లా విద్యార్ధి మృతి: కడసారి చూపుకోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు  

France Telugu Student Praveen Kumar - Telugu France, Kalapala Suryanarayana, Lungs Cancer, Praveen Kumar, Tdp, Telugu Student

ఉన్నత చదువుల కోసం ఫ్రాన్స్‌‌కు వెళ్లిన ఓ తెలుగు విద్యార్ధి అనారోగ్యంతో మరణించాడు.కృష్ణా జిల్లా రేమల్లేకు చెందిన అవిర్నేని రంగారావు కుమారుడు 28 ఏళ్ల ప్రవీణ్ కుమార్ ఎంఎస్ చదివేందుకు రెండేళ్ల క్రితం ఫ్రాన్స్‌కు వెళ్లాడు.

 France Telugu Student Praveen Kumar

ఈ క్రమంలో కొద్దినెలల నుంచి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ప్రవీణ్ బుధవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.

కుమారుడి మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు.

ఫ్రాన్స్‌లో కృష్ణా జిల్లా విద్యార్ధి మృతి: కడసారి చూపుకోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఇదే ఓ బాధ అనుకుంటే ప్రస్తుతం కరోనా కారణంగా లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో అతని మృతదేహం భారతదేశానికి తరలించడానికి ఇబ్బందులు ఎదురువుతున్నాయి.

కఠిన ఆంక్షలు, చట్టపరమైన నిబంధనలు ప్రతిబంధకంగా మారడంతో తమ బిడ్డను కడసారి చూసుకునేందుకు సాయం చేయాలని తల్లిదండ్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.

కాగా మృతుడు ప్రవీణ్.టీడీపీ నేత కలపాల సూర్యనారాయణకు స్వయానా మేనల్లుడు.

కాగా, ఫ్రాన్స్‌లో ఇప్పటి వరకు 1,81,575 మంది కరోనా బారినపడగా, 28,132 మంది ప్రాణాలు కోల్పోయారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Related Telugu News,Photos/Pics,Images..