కరోనా పోరాటంలో భారత్‌కు బాసటగా ఫ్రాన్స్.. !

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఈ వైరస్‌తో యుద్ధం చేస్తున్న భారత్‌కు పలు దేశాలు బాసటగా నిలుస్తున్నాయి.ఈ క్రమంలో ఇది వరకే తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్న మిగతా దేశాల బాటలో ఫ్రాన్స్ కూడా చేరింది.

 France Has Declared Its Support For India Corona War-TeluguStop.com

ఈ క్రమంలో ఇరు దేశాలు కలిసి కొవిడ్‌-19పై పోరాడదామని పిలుపునిచ్చింది.

ఇకపోతే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇండియాలో తీవ్రంగా ఉన్న దృష్ట్యా ఇక్కడి ప్రజలు, కరోనా పేషెంట్లు కఠినమైన పరిస్దితులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

 France Has Declared Its Support For India Corona War-కరోనా పోరాటంలో భారత్‌కు బాసటగా ఫ్రాన్స్.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నేపధ్యంలో పగలు, ప్రతికారాలు అంటూ ఇన్నాళ్లూ స్వార్ధంతో ప్రవర్తించిన చైనా, పాకిస్దాన్ కూడా భారత్‌కు అండగా నిలిచేందుకు ముందుకు రావడం శుభపరిణామమే.

ఇదిలా ఉండగా పలు ఫ్రెంచి కంపెనీలు కూడా సాయం అందించడానికి ముందుకు వస్తున్నాయి.

అంతే కాకుండా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రన్ ఫేస్‌బుక్ వేదికగా భారత్‌కు హై కెపాసిటీ ఆక్సిజన్ జనరేటర్లు, 2 వేల మంది పేషెంట్లకు ఐదు రోజులకు సరిపోయే లిక్విడ్ ఆక్సిజన్, వెంటిలేటర్లను ఇతర వైద్య పరికరాలను త్వరలోనే పంపిస్తామని వెల్లడించారు.ఇకపోతే ప్రస్తుతం దేశంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

#India #Support #France #Corona War

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు