ఉద్యోగం బోర్ కొట్టింది.. ఆ పని చేసి ఏకంగా 34 లక్షలు..?

అదేంటోగాని కొంతమంది ఎంతో కొత్తగా ఆలోచిస్తుంటారు.ఎంత కొత్తగా అంటే వారి ఆలోచన తెలిసిన వారు ఏకంగా ఆశ్చర్యపోవాల్సినంత కొత్తగా.

 France Person Frederick Dessert Case File Against The  Perfume Company, France,-TeluguStop.com

తాజాగా ఇక్కడ ఒక ఉద్యోగి అలాంగే ఆలోచించాడు.ఉద్యోగంలో కొత్తదనం లేదు అని ఉద్యోగానికి రాజీనామా చేసాడు.

ఆ తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకని ఏకంగా ఆ కంపెనీ పైనే నష్టపరిహారం వేసాడు.చివరికి 34 లక్షలు సాధించాడు.

వివరాల్లోకి వెళితే.ఫ్రాన్స్ కి చెందిన ఫ్రెడరిక్ డెస్సార్ట్ అనే వ్యక్తి పెర్ఫ్యూమ్ కంపెనీలో పని చేస్తుండగా.రోజూ ఒకే పని చేయడం బోర్ కొట్టి ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు.ఇక మరో జాబ్ వెతుక్కోవడం ఎందుకని ఏకంగా సదరు కంపెనీ యాజమాన్యం పై నే కోర్టులో కేసు వేశాడు.

దీంతో ఈ కేసులో కోర్టుకు తిరగడమే సరిపోయింది ఆ వ్యక్తికి.

తన ఉద్యోగం పోయినందుకు తను ఎంతో మనో వేదనకు గురయ్యామని…కంపెనీ యాజమాన్యం తన పట్ల అనుచితంగా ప్రవర్తించింది అంటూ కోర్టులో వాదించాడు.

దీంతో నాలుగేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ కేసులో చివరికి ఫెడరిక్ డిస్సార్డ్ ఏకంగా నాలుగు లక్షల యూరోలు నష్టపరిహారం కోరగా… కోర్టు 45 వేల యూరోలు ఇవ్వాలంటూ పరిచయం సదరు కంపెనీకి ఆదేశించింది.ఈ నష్టపరిహారం మన కరెన్సీ ప్రకారం ఏకంగా 34.20 లక్షల వరకు ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube