గూగుల్ కి భారీ జరిమానా..?

ప్రపంచంలో ఎక్కువ మంది గూగుల్ నే వినియోగిస్తున్నారు.ఇప్పుడున్న కాలంలో గూగుల్ లేకుండా ఎవ్వరూ బతకలేరు.

 France Anti Trust Watch Dog Organization Fines Google , Google Fine, Latest News-TeluguStop.com

ఏ మూల ఏం జరుగుతున్న గూగుల్ ఇట్టే చెప్పేస్తుంది.అంతే కాకుండా మనకు ఎటువంటి సమాచారం కావాలన్నా.

ప్రతి ఒక్క విషయం కూడా గూగుల్ మనకు తెలియజేస్తుంది.అలాంటి గూగుల్ సంస్థకు భారీ జరిమానా విధించిన ఘటన చోటుచేసుకుంది.

ప్రముఖ సెర్చ్​​ ఇంజిన్ గూగుల్​కు ఫ్రాన్స్​కు చెందిన యాంటీ-ట్రస్ట్ వాచ్​డాగ్​​ సంస్థ జరిమానా విధించడం కలకలం రేపుతోంది.న్యూస్ కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘంచినందుకు గాను ఈ జరిమానాను విధించారు.500 మిలియన్ల యూరోలు 593 మిలియన్ డాలర్లను గూగుల్ కు ఆ సంస్థ జరిమానా విధించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది.భారత కరెన్సీలో ఇది సుమారుగా రూ.4,415 కోట్లుగా ఉంది.అయితే ఇటువంటి ఘటనపై గూగుల్ ఇప్పటి వరకూ తెలియజేయలేదు.

దేశీయ న్యూస్ పబ్లిషర్లకు సంబంధించి తాత్కాలిక ఆదేశాలను అమలు చేయడంలో గూగుల్ విఫలం అయ్యింది.

దీంతో ఆ సంస్థ గూగుల్ పై ఇటువంటి చర్యలు తీసుకుంది.

ప్రముఖ న్యూస్ పబ్లిషర్స్ తమ న్యూస్ కంటెంట్ వినియోగంపై రెమ్యురేషన్‌పై చర్చించడంలో గూగుల్ విఫలమవ్వడంతో వాచ్ డాగ్ యాంటీ ట్రస్ట్ అథారిటీ దీనిపై స్పందించింది.ఈ తాత్కాలిక ఉత్తర్వులను గూగుల్ ఉల్లంఘించిందా అనే దానిపై విచారణ జరగనుంది.

దీనిపై ఇప్పటివరకూ గూగుల్ అధికారికంగా స్పందించలేకపోయినప్పటికీ ఈ ఘటన కలకలం రేపుతోంది.

Telugu Watch Dog, Google, France, Google Fine, Latest, Ups, Copy-Latest News - T

రాబోయే రెండు లేదా మూడు నెలల్లో వార్తా సంస్థలకు ఇతర పబ్లిషర్లకు వార్తల వినియోగానికి ఎలా రెమ్యురేషన్ ఇస్తుందనే దానిపై ప్రతిపాదనలు అనేవి పంపాల్సి ఉంది.అయితే అలా చేయని పక్షంలో గూగుల్ రోజుకు అదనంగా 9 లక్షల యూరోల చొప్పున జరిమానాను విధించాల్సి ఉంటుంది.గతంలో కూడా గూగుల్​కు ఆన్ లైన్ ​ప్రకటనల విషయంలోనూ భారీ జరిమానాను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఫ్రాన్స్​కు చెందిన యాంటీ ట్రస్ట్ వాచ్​ డాగ్​ సంస్థ 268 మిలియన్​ డాలర్ల జరిమానాను గూగుల్ కు విధించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube