సింగరేణిలో రానున్న నాలుగు సంవత్సరాల్లో 14 కొత్త గనుల ప్రారంభమట.. !

సింగరేణి సంస్దను లాభాల బాటలో నడిపించి రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో మరో 14 కొత్త గనులను ప్రారంభించాలంటే ప్రస్తుతం ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయాలని దీనికి అందరు సహకరించాలని, సంస్థ సీఅండ్ఎండీ ఎన్ శ్రీధర్ పేర్కొన్నారు.

 Singareni With Fourteen New Mines In The Next Four Years, Singareni, 14 New Mine-TeluguStop.com

ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల లక్య సాధన దిశగా కంపెనీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

కాగా ప్రస్తుతం సింగరేణి 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నుంచి వచ్చే ఏడాది 67 మిలియన్ టన్నులకు చేరబోతుందని వెల్లడించారు.

Telugu Md, Sridhar, Singareni, Hours-Latest News - Telugu

ఇకపోతే హైదరాబాద్ సింగరేణి భవన్ లో రెండు రోజుల పాటు జరిగే మేధోమధన సదస్సులో సింగరేణి భవిష్యత్ ప్రణాళికలపై సింగరణి డైరెక్టర్లు, ఉన్నతధాకారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సదస్సులో సింగరేణి డైరెక్టర్లతో పాటు మిగతా ఉన్నతాధికారులతో సీఅండ్ ఎండీ సుధీర్ణ చర్చలు కొనసాగించారు.

ఇక రానున్న నాలుగేండ్ల కాలంలో కొత్తగా 14 గనులు తెరవాల్సి ఉందని, అలాగే ప్రస్తుతం ఉన్న నాలుగు గనులను విస్తరించాల్సి ఉందని తెలిపారు.

ఈ క్రమంలో భారీ యంత్రాల పని గంటలు పెంచేందుకు ఆపరేట్లు, కార్మికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉత్పాదకత పెరిగేలా చూడాలని కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube