నాలుగేండ్లుగా ప్ర‌య‌త్నించినా కాని ప‌ని.. కేటీఆర్‌కు తెలిసి ఏం చేశారంటే

Four Years Tried But Did Not Work What Ktr Did

సాధార‌ణ వ్య‌క్తులు త‌లుచుకుంటే ఏదీ కాక‌పోవ‌చ్చేమో గానీ ప్ర‌భుత్వంలో కీల‌కంగా ఉన్న‌ మంత్రి త‌ల‌ుచుకుంటే కానిదంటూ ఉంటుందా చెప్పండి.మరీ ముఖ్యంగా ప్ర‌భుత్వ ప‌ర‌మైన ప‌నులు అయితే క్ష‌ణాల్లోనే అయిపోతాయి.

 Four Years Tried But Did Not Work What Ktr Did-TeluguStop.com

లేకుంటే వారి ప‌వ‌ర్‌కే అర్థం లేదు క‌దా.అయితే తెలంగాణ‌లో అంద‌రికంటే కీల‌క మైన మంత్రి అన‌గానే ముందుగా గుర్తుకు వ‌చ్చేది మాత్రం కేటీఆర్‌.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొడుకుగా ఆయ‌నకు అటు ప‌బ్లిక్ లో ఇటు ప్ర‌భుత్వంలో తిరుగులేని ప‌వ‌ర్ ఉంది.కాగా ఆయ‌న ప‌నిత‌నం మ‌రోసారి నిరూపించుకున్నారు కేటీఆర్‌.

 Four Years Tried But Did Not Work What Ktr Did-నాలుగేండ్లుగా ప్ర‌య‌త్నించినా కాని ప‌ని.. కేటీఆర్‌కు తెలిసి ఏం చేశారంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్ప‌టికే ఎన్నో ప‌నులను ఇలా త‌న చాక‌చ‌క్యంతో నిర్వ‌హించి నెట‌ిజన్ల ప్ర‌శంస‌లు అందుకున్నారు కేటీఆర్‌.ఇప్పుడు తెలంగాణ మ‌ణిహారం అయిన హైద‌రాబాద్ కు చెందిన శ్రీజ సివిల్స్ లో మంచి ర్యాంక్ కొట్టేశారు.

అయితే ఆమె మంత్రి కేటీఆర్ ను కలిసి త‌న విజ‌యానికి సంబంధించిన విష‌యాల‌ను వివ‌రించారు.ఇక త‌న త‌ల్లి ఏఎన్ ఎంగా వ‌రంగ‌ల్ లో ప‌నిచేస్తుంద‌ని, తండ్రి ప్ర‌యివేటు ఉద్యోగం చేస్తున్నారంటూ వివ‌రించారు శ్రీజ‌.

దాంతో కేటీఆర్ షాక్ అయిపోయి మీ అమ్మ నిత్యం వ‌రంగ‌ల్ వెళ్లి పని చేసి తిరిగి హైద‌రాబాద్‌కు వస్తున్నారా అని అడిగారు.

Telugu Assistant Nurse, Civils, Srija Mother, Telangana Ktr, Warangal-Latest News - Telugu

త‌న త‌ల్లికి హైద‌రాబాద్‌కు బ‌దిలీ కావాలంటూ నాలుగేళ్లుగా విజ్ఞ‌ప్తి చేస్తున్నామని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని వివ‌రించారు శ్రీజ‌.దీంతో కేటీఆర్ తాను ఆ ప‌ని చేస్తానంటూ హామీ ఇచ్చారు.ఇక శ్రీజ కేటీఆర్ ద‌గ్గ‌రి నుంచి ఇంటికి వెళ్ల‌గానే త‌న తల్లికి వరంగల్ నుంచి హైద‌రాబాద్ కు ట్రాన్స్ ఫ‌ర్ అయిపోయిందంటూ ఉత్తర్వులు కూడా వ‌చ్చేశాయి.

ఈ విష‌యం తెలిసి శ్రీజ ఎంతో సంతోషించారు.కేటీఆర్ ఫోన్ చేసి ట్రాన్స్ ఫ‌ర్ చేసేయాలంటూ చెప్పిన నిమిషాల వ్యవధిలోనే ఉత్త‌ర్వులు రావ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని శ్రీజ వివ‌రించారు.

#Telangana KTR #Warangal #Assistant Nurse #Srija Mother #Civils

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube