ఆర్‌ మల్టీస్టారర్‌లో నలుగురికి వాట!  

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ‘బాహుబలి’ చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకున్నాడు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘బాహుబలి’ చిత్రం తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న రాజమౌళి త్వరలో స్టార్‌ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో మల్టీస్టారర్‌ను తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్‌ మీదకు తీసుకెళ్లాలని రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని మళ్లీ విభిన్నమైన కథతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి రాజమౌళి రెడీ అవుతున్నాడు.

Four Profit Share For Rajamouli Multistarrer Movie-

Four Profit Share For Rajamouli Multistarrer Movie

రాజమౌళి గతకొంత కాలంగా తన చిత్రాలకు గాను పారితోషికం కాకుండా లాభాల్లో వాటా తీసుకుంటున్నాడు. దాంతో ఈయనకు పారితోషికం కంటే చాలా లాభం వస్తుంది. ఇకపోతే ఈ చిత్రంలో నటించనున్న స్టార్‌ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు ఎంత మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నారు అనేది ఆసక్తిగా మారింది. భారీ బడ్జెట్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం తారక్‌, చెర్రీలు పారితోషికం తీసుకోవడం లేదని సమాచారం. అందుకు రాజమౌళి కారణం అంటూ ఫిల్మ్‌నగర్‌లో టాక్‌ వినిపిస్తోంది.

Four Profit Share For Rajamouli Multistarrer Movie-

రాజమౌళి సూచన మేరకు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు కూడా ఈ చిత్రానికి పారితోషికం తీసుకోకుండా వాటాలను తీసుకోవడానికి ఒప్పుకున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. మొత్తానికి ఆర్‌ మల్టీస్టారర్‌లో దానయ్య, రాజమౌళి, ఎన్టీఆర్‌, రామచరణ్‌లు నలుగురు కూడా వాటాలను పంచుకోనున్నారు. ఈ చిత్రాన్ని త్వరలో సెట్స్‌ మీదకు తీసుకెళ్లి 2020 వరకు పూర్తి చేయాలని చిత్ర యూనిట్‌ ఇప్పటికే సన్నాహాలు మొదలెట్టింది.