ఈ వారం అంతా కూడా సైలెంట్‌... శేఖర్‌ ఏమైనా సందడి చేసేనా?

కరోనా తర్వాత పెద్ద సినిమాల జాతర మొదలు అయ్యింది.ప్రతి వారం కూడా చిన్నా పెద్ద సినిమాలు ఏవో ఒకటి విడుదల అవుతున్నాయి.

 Four Movies Release Today , Bandla Ganesh , Degala Babji , Movie News , Rajashekhar , Shekhar Movie , Shivani-TeluguStop.com

ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భీమ్లా నాయక్ మొదలుకుని చాలా సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.ఆర్‌ ఆర్‌ ఆర్‌, కేజీఎఫ్‌, సర్కారు వారి పాట ఇంకా పెద్ద సినిమాలు కొన్ని విడుదల అయ్యాయి.

పెద్ద సినిమా వల్ల చిన్న సినిమా లు నలిగి పోతున్నాయి.సమయం దొరకడం లేదు అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 Four Movies Release Today , Bandla Ganesh , Degala Babji , Movie News , Rajashekhar , Shekhar Movie , Shivani-ఈ వారం అంతా కూడా సైలెంట్‌#8230; శేఖర్‌ ఏమైనా సందడి చేసేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాంతో కాస్త గ్యాప్‌ ఇచ్చి పెద్ద సినిమాలను విడుదల చేయాలని భావించారు.అందుకే ఈ వారం పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో చిన్న సినిమా లు క్యూ కడుతున్నాయి.

వారం కాస్త నోటెడ్ అయిన శేఖర్ సినిమా విడుదల కాబోతుంది.జీవిత దర్శకత్వం లో రూపొందిన శేఖర్ సినిమా లో హీరోగా రాజశేఖర్ నటించగా ఆయన కూతురు శివాని కీలక పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే.

నేడు ఆ సినిమా విడుదల కాబోతుంది.అది కాకుండా బండ్ల గణేష్ నటించిన డేగల గణేష్ మరియు సంపూర్నేష్‌ బాబు నటించిన ధగడ్‌ సాంబ ఇంకా అంతా కొత్త వారు చేసిన ధ్వని సినిమా లు విడుదల కాబోతున్నాయి.

ఈ నాలుగు సినిమా ల్లో కాస్త శేఖర్ కు హైప్ ఉంది.ఆ సినిమా సక్సెస్ అయితే పర్వాలేదు.లేదంటే మొత్తం వారం అయితే కూడా సైలెంట్‌ గా ఉంటుంది.పెద్ద సినిమా లు కేజీఎఫ్ సర్కారు వారి పాట సినిమా ల వసూళ్లు నిలకడగా ఉండే అవకాశం ఉంది.

ముఖ్యంగా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ఖచ్చితంగా కుమ్మేయడం ఖాయం అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube