గూగుల్ ప్లేస్టోర్ నుండి మరో 4 యాప్స్ ఔట్.. మీ ఫోన్ లో ఉంటే వెంటనే తొలగించండి..!

ఈ మధ్యకాలంలో టెక్ దిగ్గజం కంపెనీ గూగుల్ సంస్థకు చెందిన గూగుల్ ప్లే స్టోర్ ఎప్పటికప్పుడు వారి నిబంధనలను ఉల్లంఘించిన యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించడం మనం గమనిస్తూనే ఉన్నాం.నిజానికి గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న యాప్ లు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఎలాంటి అభద్రత ఉండదన్న ధైర్యంతో ఏమీ ఆలోచించకుండా గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటాం.

 Google Play Store Removes Money Lednding Applications, Google, Google Play Store-TeluguStop.com

అయితే కొన్ని యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో ముందుగా రిజిస్టర్ అయిన తర్వాత వారి అసలు పని మొదలు పెడుతున్నాయి.

గూగుల్ సంస్థకు చెందిన నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ కొన్ని పనులను నిర్వహిస్తున్నాయి.

ఇందులో భాగంగానే గూగుల్ సంస్థ ఎప్పటికప్పుడు వారి దగ్గర ఉన్న యాప్స్ పై ఒక కన్ను వేసి ఉంటాయి.వీటిలో ఏవైనా సరే రూల్స్ అతిక్రమించినట్లు కనిపిస్తే వాటిని వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించబడతాయి.

తాజాగా ఇదే సంఘటన మరోసారి జరిగింది.గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న నాలుగు యాప్స్ వల్ల ప్రజలకు నష్టం కలుగుతుందని ఉద్దేశంతో అలాగే గూగుల్ సంస్థ యొక్క రూల్స్ బ్రేక్ చేశారని వాటిని తొలగించడం జరిగింది.

Telugu Appsremoved, Google, Google Store-Latest News - Telugu

అయితే ఈ నాలుగు యాప్స్ డబ్బులు సంబంధించిన యాప్స్.వీటిలో ఏవో లోన్స్ అంటూ ఇస్తూ జనం నుండి డబ్బులు కాచేసే విధంగా ప్లాన్స్ చేస్తున్నాయని గూగుల్ సంస్థకు రిపోర్ట్స్ రావడంతో వాటిని తొలగించడం జరిగింది.ఇందులో భాగంగా ఓకే క్యాష్, గో క్యాష్, ఫ్లిప్ క్యాష్, స్నాప్ ఇట్ లోన్ ఇలా 4 యాప్స్ రూల్స్ బ్రేక్ చేస్తున్నాయని వీటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తీసివేయడం జరిగింది.ఒకవేళ ఈ నాలుగింటిలో ఏదైనా మీ మొబైల్ ఫోన్ లో ఉంటే వాటిని వెంటనే తొలగించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube