సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు మృతి...?

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ సమీపంలోని అంజనీపురి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృత్యువాత పడ్డట్లు,సుమారు 16 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

గాయపడిన వారికి స్థానిక జనరల్ హాస్పిటల్ కి తరలించారు.అర్వపల్లికి చెందిన ఆటో అంజనాపురి చౌరస్తాలో అగి ఉన్న లారీని ఢీ కొట్టి పల్టీ కొట్టడంతో వెనుక నుండి వేగంగా వస్తున్న ఎర్టిగా కారు ఆటో ఢీ కొట్టడంతో ప్రమాదం తీవ్రత పెరిగినట్లు తెలుస్తుంది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సైబర్ అలర్ట్ : అకౌంట్లో డబ్బులు పడ్డాయని మెసేజ్ వచ్చిందా.. జాగ్రత్త సుమీ..
Advertisement

Latest Suryapet News