సాగర్ లో టీఆర్ఎస్ కు చుక్కలే ! భయపెడుతున్న 400 మంది ?

తెలంగాణ లో టీఆర్ఎస్ పార్టీకి ఎన్నెన్నో ఇబ్బందులు వచ్చిపడ్డాయి.ఇప్పటికే దుబ్బాకలో ఫలితం బోల్తా కొట్టింది.

 Four Hundred People Contesting Against Trs In Nagarjunasagar By Election, Trs, B-TeluguStop.com

జిహెచ్ఎంసి ఎన్నికల్లో నూ ఆశించినంత స్థాయిలో ఫలితం దక్కలేదు.ఇప్పుడు అకస్మాత్తుగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు రావడంతో ఇక్కడ టిఆర్ఎస్ బాగా టెన్షన్ పడతోంది.

బిజెపి తెలంగాణలో బలపడడం, అలాగే కాంగ్రెస్ సైతం ఈ నియోజకవర్గంలో బలంగా ఉండడంతో, టిఆర్ఎస్ టెన్షన్ గా ఈ ఎన్నికలకు వెళ్తోంది.అయితే ఇప్పుడు అకస్మాత్తుగా టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా 400 మంది అమరవీరుల కుటుంబ సభ్యులు నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోటీకి దిగుతుండడంతో టెన్షన్ మరింతగా పెరిగిపోతోంది.

ఎందుకంటే గతంలోనూ ఇదే విధంగా టిఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా వందలాది మంది పసుపు రైతులు పోటీకి దిగారు.

పసుపు బోర్డు తీసుకురావడంలో కవిత విఫలం అయ్యారని ఆరోపిస్తూ, వీరంతా ఎన్నికల్లో పోటీ చేశారు.

ఇదే అంశంపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడంతో బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతి లో కవిత ఓటమి పాలయ్యారు.ఇప్పుడు అదే వ్యూహాన్ని అమలు చేసేందుకు అమరవీరుల కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు.

అమరవీరుల త్యాగాల వల్ల ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించింది అని, కానీ తెలంగాణ వచ్చి ఇంత కాలం అయినా, అమరవీరుల కుటుంబ సభ్యులను ఆదుకోవడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వీరంతా పోటీకి దిగుతున్నారట.

ఈ ఎన్నికల్లో పోటీకి దిగి టిఆర్ఎస్ కు గట్టి గుణపాఠం చెబుతామని అమరవీరుల ఫోరం చెబుతోంది.

అమరవీరుల కుటుంబ సభ్యులకు 10 లక్షల పరిహారం, ఐదెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చలేకపోయారని వారు టీఆర్ఎస్ పై ఫైర్ అవుతున్నారు.అంతేకాదు తాము షర్మిల పార్టీ మద్దతు తీసుకుంటాము అంటూ వారు ప్రకటించారు.

బుధవారం నాటికి 11 నామినేషన్లు దాఖలు అయ్యాయి.మార్చి 30 వరకు ఈ నామినేషన్ల ప్రక్రియ ఉండడంతో ఇప్పుడు ఈ అమరవీరుల కుటుంబసభ్యులు 400 మంది తో పాటు మరెంతమంది పోటీకి దిగుతారు అనేది టీఆర్ఎస్ కు టెన్షన్ కలిగిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube