విశ్వాసంలో నెం.1... యజమాని ప్రాణాలు కాపాడేందుకు చనిపోయిన నాలుగు కుక్కలు  

Four Dogs Engage In Battle With Snake Die Guarding Owners House-four Dogs,owners House,venomous Snake,నాలుగు కుక్కలు

ఈ ప్రపంచంలో అత్యంత విశ్వాసం చూపించే జంతువు కుక్క అనడంలో ఎలాంటి సందేహం లేదు. మనిషి కంటే కూడా అధికంగా కుక్కలు విశ్వాసంతో ఉంటాయని అంటూ ఉంటారు. కుక్కలు తమ యజమానుల పట్ల పలు సందర్బాల్లో విశ్వాసం చూపించి ప్రాణాలు కాపాడిన విషయం తెల్సిందే..

విశ్వాసంలో నెం.1... యజమాని ప్రాణాలు కాపాడేందుకు చనిపోయిన నాలుగు కుక్కలు-Four Dogs Engage In Battle With Snake Die Guarding Owners House

మనం ఎన్నో సార్లు అలాంటి సంఘటనలు చూశాం. యజమానులను మేల్కొనేలా చేసి, లేదంటే ప్రమాదంను ముందే పసిగట్టి యజమానికి తెలియజేయడం వల్ల కుక్కలు ఎన్నో సార్లు విశ్వాసం ఉన్న జంతువులం అంటూ నిరూపించుకున్నాయి. ఈ సారి యజమానుల ప్రాణాలను కాపాడేందుకు ఏకంగా నాలుగు కుక్కలు మృతి చెందాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… బీహార్‌ రాష్ట్రం భాగల్‌ పూర్‌ ప్రాంతంకు చెందిన ఒక డాక్టర్‌ కుక్కను పెంచుకుంటున్నాడు. ఆ కుక్కకు రెక్స్‌ అనే పేరు పెట్టాడు. చాలా ఏళ్లుగా రెక్స్‌ ఆ డాక్టర్‌ ఫ్యామిలీతో ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్‌లో ఒక మెంబర్‌గా రెక్స్‌ కలిసి పోయింది.

చాలా మంచి కుక్కగా పేరు దక్కించుకుంది. కొన్నాళ్ల క్రితం రెక్స్‌ మూడు పిల్లలకు జన్మనిచ్చింది. నాలుగు కుక్కలను కూడా డాక్టర్‌ ఫ్యామిలీ పెంచుతూ వస్తోంది.

తల్లి నుండి పిల్లలను వేరు చేయడం ఇష్టం లేని డాక్టర్‌ ఫ్యామిలీ ఆ క్కులను అలాగే పెంచుతున్నారు.

తాజాగా ఇంటి ఆవరణలో కుక్కలు ఉన్నాయి. ఆ సమయంలోనే ఇంట్లోకి ఒక పాము వచ్చింది. ఇంట్లోకి పాము వచ్చిన విషయాన్ని కుక్కలు గమనించాయి.

ఆ పామును బయటకు పంపేందుకు నాలుగు కుక్కలు కూడా విపరీతంగా ప్రయత్నించాయి. ఆ పాము మాత్రం చాలా ప్రతిఘటించింది. కుక్కలు కరిచేందుకు ప్రయతించినా కూడా పాము మాత్రం ఆ కుక్కలను కాటు వేసింది.

చాలా సమయం పోరాడిన తర్వాత నాలుగు కుక్కలను కూడా పాము కాటేసింది. పాముతో పారాడి దాన్ని బయటకు పంపించిన కుక్కలు కొద్ది సమయంకు మృతి చెందాయి. పాము కాటుతో మృతి చెందాయని క్లీయర్‌గా సీసీ టీవీలో కనిపించింది.

పామును బయటకు పంపించేందుకు ఆ కుక్కలు చేసిన ప్రయత్నం డాక్టర్‌ కుటుంబంకు కన్నీరు తెప్పించింది. అత్యంత విషాదమైన ఈ సంఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. కుక్కలకు సాంప్రదాయ బద్దంగా డాక్టర్‌ ఫ్యామిలీ అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.