ఈ నాలుగు యూరప్ దేశాల్లో భారతీయులకు డోర్స్ ఓపెన్.. కొత్త రూల్స్ ఇవే..!!

2019 చివరిలో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.గడిచిన ఏడాదిన్నర కాలంలో కోట్లాది మంది ప్రజలు దీని బారినపడగా.

 The Four Countries In Europe Where Indians Can Travel Now And The Rules They Mus-TeluguStop.com

అదే స్థాయిలో మరణాలు సైతం సంభవించాయి.కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి తనకంటే ఎన్నో రెట్లు శక్తివంతుడైన మనిషిని నాలుగు గోడల మధ్య బందీని చేసింది.

నలుగురిలోకి వెళ్లాలంటే భయం.తోటి వ్యక్తి తుమ్మితే టెన్షన్.ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నం కాగా.లక్షలాది మంది రోడ్డునపడ్డారు.ఇలా ఒకటి కాదు.రెండు కాదు ఈ మహమ్మారి వల్ల ఎన్నో దారుణాలు.2020 చివరి నాటికి ఏవో కొన్ని దేశాలు తప్పించి.అంతగా వైరస్ ఉద్ధృతి లేకపోవడం అదే సమయంలో వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రావడంతో ఇక ముప్పు తప్పినట్లేనని అంతా భావించారు.

కానీ ఉత్పరివర్తనం చెంది .ఎన్నో రెట్లు శక్తిని పుంజుకుని మానవాళిపై దాడి చేయడం ప్రారంభించింది కోవిడ్.

ఇక భారత్‌లో సెకండ్ వేవ్ కారణంగా అనేక దేశాలు మనదేశం నుంచి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధించాయి.అయితే ఇప్పుడిప్పుడే పరిస్ధితులు అదుపులోకి వస్తుండటంతో అమెరికా, బ్రిటన్, యూఏఈ, ఆస్ట్రేలియా వంటి దేశాలు భారతీయులను అనుమతిస్తున్నాయి.

అలాగే ఇండియాలో తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌లకు కూడా ఆమోదముద్ర వేశాయి.ఇప్పటి వరకు భారత్ 100 కోట్ల డోసుల్ని పంపిణీ చేయగా.దేశ ప్రజల్లో కనీసం 85 శాతం మంది ఒక డోస్ వ్యాక్సిన్ అయిన స్వీకరించారు.దీంతో విమాన ప్రయాణాలను పెంచేందుకు గాను దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలతో చర్చిస్తున్నారు.

ఈ క్రమంలో నాలుగు యూరప్ దేశాలు ఎయిర్ బబుల్‌ కిందకి వచ్చినట్లుగా తెలుస్తోంది.అవి ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, యూకేలు.

Telugu Covaxin, Covid, Europe, France, Germany, Indians, Netherland, Europeindia

జూలై నెలలో భారత్‌తో పాటు పలు దేశాల ప్రయాణికులపై విధించిన ఆంక్షలను జర్మనీ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.అలాగే భారత్‌ను హై ఇన్సిడెన్స్ ఏరియా కేటగిరీ కిందకు చేర్చింది.దీని ప్రకారం భారతీయులకు జర్మనీలో ప్రవేశించేందుకు అనుమతి లభించింది.దీనితో పాటు నెదర్లాండ్స్‌తో నవంబర్ 1న భారత్ ఎయిర్‌ బబుల్ ఒప్పందం కుదుర్చుకుంది.దీని ప్రకారం ఇరు దేశాల మధ్య విమాన రాకపోకలకు లైన్ క్లియర్ అయ్యింది.ఫ్రాన్స్ కూడా భారతీయ ప్రయాణీకులు తమ దేశంలోకి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇక మనదేశంతో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకున్న మరో దేశం బ్రిటన్.

Telugu Covaxin, Covid, Europe, France, Germany, Indians, Netherland, Europeindia

ఇటీవల భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కోవాగ్జిన్‌కు అనుమతి మంజూరు చేసింది బ్రిటన్ ప్రభుత్వం.ఈ మేరకు నవంబర్ 22 నుంచి అంతర్జాతీయ ప్రయాణీకుల అప్రూవుడ్ వ్యాక్సిన్ జాబితాలో కోవాగ్జిన్‌కు స్థానం కల్పిస్తామని యూకే ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ నిర్ణయం వల్ల కోవాగ్జిన్ వేయించుకున్న వారు .బ్రిటన్‌లో అడుగుపెట్టిన తర్వాత క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదు.ఈ మేరకు భారత్‌లో బ్రిటీష్ హైకమీషనర్ అలెక్స్ ఎల్లిస్ సోమవారం ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

నవంబర్ 22 ఉదయం 4 గంటలకు ఈ ఆదేశాల్లో అమల్లోకి రానున్నాయి.కోవాగ్జిన్‌తో పాటు డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్‌లోని చైనాకు చెందిన సినోవాక్, సినోఫార్మ్‌లకు సైతం యూకే సర్కార్ అంగీకారం తెలిపింది.

దీని వల్ల యూఏఈ, మలేషియా దేశాల వాసులకు ప్రయోజనం చేకూరనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube