కేరళలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. సొంత నియోజక వర్గంలోనే షాక్.. ?

కేంద్రంలో బీజేపీ హవా సాగుతున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ పరిస్దితి ప్రస్తుతం ఇరకాటంలో పడిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో కొంత కాలం సైలంట్ అయినా రాహుల్ గాంధీ ప్రస్తుతం హస్తం లో జీవం పోయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనబడుతుంది.

 Four Congress Leaders Say Good Bye To Congress In Kerala Wayanad , Kerala, Tamil-TeluguStop.com

ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా కనిపిస్తున్న విషయం తెలిసిందే.

అదీగాక ప్రజల్లోకి వెళ్ళి వారి కష్టాలను అడిగి తెలుసుకుంటూ, బీజేపీకి చురకలు వేస్తున్నారు.

ఇకపోతే కేరళ, తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఆయన సొంత నియోజకవర్గం అయినా వయనాడ్ లో ఊహించని షాక్ తగిలిందట.ఈ నియోజకవర్గానికి చెందిన నలుగురు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పినట్లు సమాచారం.

కాగా ఐదేళ్ల తర్వాత కేరళలో మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్న కాంగ్రెస్ కు ఇది ఎదురు దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు కూడా చెపుతున్నారు.మొత్తానికి రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు రాహూల్ తీవ్రంగా శ్రమిస్తున్న తరుణంలో ఇలాంటి తలనొప్పులతో మళ్లీ అలుగుతాడో, లేక దీటుగా ఎదుర్కొని ముందుకు సాగుతాడో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube