ఒక్క అమ్మాయ్ కోసం నలుగురు అబ్బాయిలు లక్కీ డ్రా.. చివరికి?

కలికాలం లో వింతలు జరుగుతాయని ముందు నుండే మాట్లాడుకుంటూ వస్తున్నాం.ఇప్పటికే పలుచోట్ల పలురకాల వింతలు జరుగుతూనే ఉన్నాయి.

 Four Boys Lucky Draw For One Girl In The End-TeluguStop.com

అన్ని విషయాలలో, పద్ధతులలో మార్పులు వచ్చాయి.ఇక ఏదైనా విషయంలో సొంతంగా నిర్ణయించుకునే ఆలోచన కూడా లేకుండా పోయింది.

అన్ని లక్కీడ్రా ద్వారా మీద ఆధారపడుతున్నారు.ఇలా వస్తువుల విషయంలోనే కాదు ఏకంగా ఓ అమ్మాయి విషయంలో కూడా ఇదే జరిగింది.

 Four Boys Lucky Draw For One Girl In The End-ఒక్క అమ్మాయ్ కోసం నలుగురు అబ్బాయిలు లక్కీ డ్రా.. చివరికి-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇది అచ్చం మెగా హీరో రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా లాగా ఉంటుంది.అందులో హీరోయిన్ హీరోతో పాటు మరో ముగ్గురు అబ్బాయిలను ఇష్ట పడుతుంది.

అందులో ఆ నలుగురు ఆ అమ్మాయికి ఎవరు కావాలో చిట్టి ల మీద పేరు రాసుకొని ఎవరు పేరు వస్తే వాళ్లనే లవ్ చేయాలని అంటారు కదా.అదే స్టోరీ ఓ చోట జరిగింది.సినిమాలో అంటే ఆశ్చర్యం ఉండదు.కానీ నిజ జీవితంలో మాత్రం పెద్ద వింతే అనుకోవాలి.

యూపీలోని రాంపూర్ జిల్లా కు చెందిన ఓ అమ్మాయి ఒకరిని కాదు ఇద్దరిని కాదు.ఏకంగా ఒకేసారి నలుగురు యువకులను ప్రేమించింది.

బై వన్ గెట‌్ వన్ ఆఫర్ లాగా .ఒకరిని ప్రేమించాలి, ఒకరిని పెళ్లి చేసుకోవాలి అనుకుందేమో కానీ మొత్తానికి నలుగురు అబ్బాయిలను ఇష్టపడింది.ఇక అబ్బాయిలు ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లారు.ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వారందరినీ ఊరికి తీసుకొచ్చారు.

అక్కడికి తీసుకువచ్చాక కూడా ఆ అమ్మాయికి ఎవరి కావాలో నిర్ణయించుకొని అతడినే పెళ్లి చేసుకోవాలని ఓ మంచి అవకాశం ఇచ్చారు.ఇక అందులో నీకు ఎవరంటే ఇష్టమని అడుగగా.

అందరూ ఇష్టమేనని ఓ షాక్ ఇచ్చింది.దీంతో గ్రామస్తులు అబ్బాయిలను కూడా అడగగా వాళ్లు కూడా ఒప్పుకోలేదు.

ఇక ఏమీ చేయలేక లక్కీ డ్రా వేయాలని గ్రామస్తులు కోరుకోగా.దీంతో లక్కీ డ్రా వేసిన తర్వాత అందులో పేరు వచ్చిన యువకుడితో పెళ్లి చేశారు.

#Love #Lucky Draw #Four Boys #One Girl

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు