దొరికిన వాలీ..సంబరాలు చేసుకుంటున్న జంతు ప్రేమికులు

జంతువులు అంటే చాలా మందికి ఇష్టం.అందుకే వాటికి ఏ ఇబ్బంది కలిగినా కూడా తల్లడిల్లిపోతుంటారు కొందరు జంతు ప్రేమికులు.

 Found Valley Animal Lovers Celebrating-TeluguStop.com

వాలీ అనే జంతువు మీద కూడా అలాంటి ప్రేమ ఉంది.అందుకే అది అకస్మాత్తుగా కనిపించకపోవడంతో అందరూ బాధపడ్డారు.

చివరికి వాలీ ఆచూకీ 22 రోజుల తర్వాత తెలిసింది.వాలీ ఆఖరిసారి ఐర్లాండ్‌లో కనిపించింది.

 Found Valley Animal Lovers Celebrating-దొరికిన వాలీ..సంబరాలు చేసుకుంటున్న జంతు ప్రేమికులు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత 22 రోజులకు అది ఆదివారం నాడు ఐస్‌లాండ్‌ దగ్గర ప్రజలకు కనిపించింది.దీంతో దాని మీద ప్రేమను చూపేవారు ఊపిరి పీల్చుకున్నారు.

వాలీగా అంటే అదొక వాల్రస్‌ అంటే ధ్రువపు జీవి.ఈ ధ్రువపు జీవి ఎక్కువగా సముద్ర జలాల్లో కనిపిస్తూ ఉంటుంది.దాని చేష్టలు చాలా మందికి నచ్చుతాయి.అందుకే దానికి మంచి గుర్తింపు వచ్చింది.

ఈ వాలీ సుమారుగా 800 కిలోల బరువు ఉంటూ విన్యాసాలు చేస్తుంది.అందుకే ఈ వాలీకి అంతర్జాతీయంగా అనేక మంది అభిమానులున్నారు.

ఈ వాలీ ఎక్కువగా ఆర్కిటిక్‌ ప్రాంతంలో ఉన్నటువంటి సముద్ర జలాల్లో కనపడుతూ ఉంటుంది.

సముద్రంలో ఈ జంతువులు చాలా అరుదుగా జీవిస్తూ ఉంటాయి.

మామూలుగా అయితే ఈ వాలీ ఐర్లాండ్ లో ఉండేది.

అయితే కొన్ని రోజులకు ముందు అది కనపడకుండా పోవడంతో వాలీ అభిమానులు నిరాశకు గురయ్యారు.జంతు ప్రేమికులు, పర్యాటకులు వాలీ ఏమై పోయుంటుందేమోనని ఆందోళన చెందడమే కాదు వాలీ చనిపోయిందని అనుకున్నారు.మరికొందరు అయితే వాలీ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని పూజలు చేశారు.ఆఖరికి 22 రోజుల త‌ర్వాత వాలీ ఆచూకీ లభ్యమైంది.22 రోజులుగా వాలీ దాదాపు 900 కిలో మీట‌ర్లు ప్ర‌యాణం చేసి ఆదివారం ఐస్‌లాండ్‌ వద్ద దర్శనమిచ్చింది.వాలీని ఐస్ లాండ్ దీవుల వద్ద బ్రిటీష్ షిప్ డైవ‌ర్స్ క‌నిపెట్టడంతో అది వాలీనే అని సీల్ రెస్క్యూ ఐర్లాండ్ సిబ్బంది గుర్తించారు.సీల్ రెస్క్యూ ఐర్లాండ్ సిబ్బంది ట్వీట్ట‌ర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.

#Rare Warle #Valley

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు