పిచ్చి పుల్లమ్మ : బిర్యానీ ఆర్డర్‌ చేసి రూ.40 వేలు పోగొట్టుకుంది, ఎలాగో తెలిస్తే మీరు ఇదే అంటారు

ఈమద్య కాలంలో ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువ అయ్యాయి.ఈ విషయాన్ని మనం ప్రతి రోజు ఏదో ఒక మీడియాలో చూస్తూనే ఉన్నాం.

 Forty Thousand Rupees Lost By A Girl Through Booking Online Food Order-TeluguStop.com

సోషల్‌ మీడియాలో గంటలు గంటలు ఉండే వారికి ఇది రోజుకు పది సార్లు అయినా కనిపిస్తూనే ఉంటుంది.అయినా వారే ఇలాంటి మోసాలకు గురవుతున్నారు.

సోషల్‌ మీడియాలో ఆన్‌ లైన్‌ మోసాల పట్ల అవగాహణ కల్పించినా కూడా కొందరు అమాయకత్వంతో మోసపోతున్నారు.తాజాగా చెన్నైకి చెందిన ప్రియా అగర్వాల్‌ 40 వేల రూపాయలు మోసపోయి లబోదిబో మంటోంది.

పిచ్చి పుల్లమ్మ : బిర్యానీ ఆర్

పూర్తి వివరాల్లోకి వెళ్తే… చెన్నైకి చెందిన ప్రియా అగర్వాల్‌ ఊబర్‌ ఈట్స్‌ ద్వారా ఫుడ్‌ను ఆర్డర్‌ చేసింది.బిర్యానీ ఆర్డర్‌ చేసిన ప్రియా ముందే పేమెంట్‌ చేసింది.రూ.76 చెల్లించి ఫుడ్‌ను ఆర్డర్‌ చేసిన ప్రియాకు చేదు అనుభవం ఎదురైంది.ఎంతకూ ఫుడ్‌ రాకపోవడంతో క్యాన్సిల్‌ కొట్టింది.క్యాన్సిల్‌ కొట్టడంతో డబ్బులు రాలేదు.76 రూపాయలు తనకు జమ కాలేదు అంటూ కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేసింది.అవతలి వ్యక్తి మీరు మీ 76 రూపాయలు పొందాలి అంటే 5000 రూపాయలు మా బ్యాంక్‌ అకౌంట్‌కు జమ చేయండి.

ఆ వెంటనే 5076 రూపాయలు మీ అకౌంట్‌కు ట్రాన్సపర్‌ అవుతాయంటూ చెప్పుకొచ్చింది.

పిచ్చి పుల్లమ్మ : బిర్యానీ ఆర్

కస్టమర్‌ అధికారి చెప్పినట్లుగానే అయిదు వేల రూపాయలను ట్రాన్సపర్‌ కొట్టింది.చాలా సేపటి వరకు డబ్బులు రాలేదు.ఆమె 76 రూపాయలే కాకుండా అయిదు వేల రూపాయలు కూడా పోయాయే అని భాధ పడకుండా మళ్లీ ఫోన్‌ చేయగా మరో 5 వేల రూపాయలు చెలిస్లే 10,076 వస్తాయంటూ చెప్పడంతో అలాగే చేసింది.

అలా ఎనిమిది సార్లు అంటే 40 వేల రూపాయలను వారు చెప్పిన బ్యాంక్‌ అకౌంట్‌కు ట్రాన్సపర్‌ చేసింది.అయినా కూడా ఆమెకు రాలేదు.అప్పుడు కాని ఆమెకు తాను మోసపోయినట్లుగా తెలిసి రాలేదు.వెంటనే పోలీసులను ఆశ్రయించింది.

పిచ్చి పుల్లమ్మ : బిర్యానీ ఆర్

ఆమె చెప్పిన విషయం విని విస్తుపోయిన పోలీసులు ఆమె అమాయకత్వంకు నవ్వుకున్నారు.మరీ ఇంత పిచ్చి పుల్లమ్మ ఏంటీ అనుకున్నారు.76 రూపాయలు రిటన్‌ రావాలి అంటే అయిదు వేల రూపాయలు జమ చేయమంటూ అడిగినప్పుడే గుర్తించాలి కదా.అలా కాకుండా అమాయకత్వంతో 40 వేలు సమర్పించుకుంది.ఇప్పుడు చెప్పండి ఆమెను ఏమనాలి.?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube