కొడుకుని కాపాడి ప్రాణాలు పోగొట్టుకున్న హాలీవుడ్ నటుడు

ఎంత గొప్ప వ్యక్తి అయిన కొడుకు ప్రాణాపాయంలో ఉంటే తన ప్రాణాలని సైతం లెక్కచేయకుండా కాపాడే ప్రయత్నం చేసి గొప్ప తండ్రి అనిపించుకుంటాడు.పిల్లల సంరక్షణలో తండ్రి అంత గొప్ప బాద్యతలు కలిగి ఉంటాడు.

 Former Wwe Superstar Shad Gaspard Found Dead, Hollywood, Wwe Fight, Lock Down, A-TeluguStop.com

అయితే అప్పుడప్పుడు తండ్రి బాధ్యతలు అతని ప్రాణాల మీదకి తీసుకొస్తాయి.ఇప్పుడు ఓ హాలీవుడ్ నటుడు అలాగే తన కొడుకుని కాపాడే ప్రయత్నంలో తాను ప్రాణాలు కోల్పోయాడు.

మాజీ రెజ్లర్ షాద్ గాస్పార్డ్ బీచ్ వద్ద సముద్రంలో ఈతకు వెళ్లి తన కుమారుడు మునిగిపోతోన్న నేపథ్యంలో అతడిని కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు.అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వినీస్‌ మెరీనా బీచ్‌లో ఆయన సముద్రంలో కొట్టుకుపోయాడని, అతడి మృతదేహం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిందని అక్కడి అధికారులు మీడియాకు తెలిపారు.అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో కొన్ని రోజులుగా బీచ్‌లలోకి అనుమతించలేదు.

ఇటీవలే ఆంక్షలు సడలించడంతో సందర్శకులు బీచ్‌ల వద్దకు వచ్చారు.ఈ క్రమంలోనే గాస్పర్డ్‌ తన కుమారుడు ఆర్యేహ్‌ తో కలిసి అక్కడకు వెళ్లి ఈత కొడుతుండగా ఓ భారీ అల వచ్చి తండ్రీకొడుకులను లాక్కుపోయింది.

దీంతో అక్కడి గార్డ్స్ వెంటనే వీరిని రక్షించడానికి ఉరకగా తన కుమారుడిని వారి వైపు తోసేసి, ముందు అతనిని రక్షించాలని గాస్పర్డ్ కోరాడు.దీంతో తాము ఆ బాలుడిని తీసుకొని ఒడ్డుకు చేర్చామని, అనంతరం వెంటనే గాస్పర్డ్‌ కోసం వెతకగా అతడు అప్పటికే సముద్రంలో కొట్టుకుపోయాడని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube