మిస్సౌరీ: ప్రమాదంలో కూతుళ్లతో సహా స్టార్ వాలీబాల్ ప్లేయర్లు దుర్మరణం  

Former Volleyball Stars Carrie Mccaw And Lesley Prather And 2 Daughters Killed In Missouri - Telugu Carrie Mccaw, , Lesley Prather, Missouri, Nri, Telugu Nri News, Volleyball

మిస్సౌరీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మాజీ స్టార్ వాలీబాల్ క్రీడాకారిణులు, వారి కుమార్తెలు దుర్మరణం పాలయ్యారు.లెస్లీ డ్రూరీ ప్రథర్ 40, క్యారీ ఉర్టన్ మెక్‌కా 44లు తమ 12 ఏళ్ల కుమార్తెలతో కలిసి కాన్సాస్ నగరంలో జరుగుతున్న వాలీబాల్ టోర్నమెంట్‌కు వెళ్తున్నట్లు లూయిస్‌విల్లే యూనివర్సిటీ వుమెన్ వాలీబాల్ జట్టు తెలిపింది.

Former Volleyball Stars Carrie Mccaw And Lesley Prather And 2 Daughters Killed In Missouri - Telugu Carrie Mccaw, , Lesley Prather, Missouri, Nri, Telugu Nri News, Volleyball-Latest News-Telugu Tollywood Photo Image

వీరంతా కలిసి మిస్సౌరీలోని సెయింట్ చార్లెస్ కౌంటీలోని ఇంటర్ స్టేట్ 64లో ప్రయాణిస్తున్నారు.ఈ క్రమంలో ఒక పికప్ ట్రక్‌కు కేబుల్‌ అడ్డురావడంతో అది అదుపు తప్పి ఆటగాళ్ల వాహనాన్ని ఢీకొట్టి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ప్రథర్ ఆమె కుమార్తె ర్యాన్.మెక్కా మరియు ఆమె కుమార్తె కాసే అక్కడికక్కడే దుర్మరణం పాలైనట్లు లూయిస్ విల్లే ప్రకటించింది.ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అరెస్ట్‌లు చోటు చేసుకోలేదని మిస్సౌరీ స్టేట్ హైవే పెట్రోల్ అధికారి డల్లాస్ థామ్సన్ తెలిపారు.ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని.

తుది నివేదికను సెయింట్ చార్లెస్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ అటార్నీ కార్యాలయానికి పంపుతామని థాంప్సన్ వెల్లడించారు.

ప్రథర్‌కు భర్త, నలుగురు పిల్లలు ఉన్నారు.ఆమె 1998 నుంచి 2001 వరకు లూయిస్ విల్లేలో ఆడారు.ఈ సమయంలో యూనివర్సిటీ ఆమెను స్టాండ్ అవుట్ ప్లేయర్‌గా అభివర్ణించింది.16 ఏళ్ల వయసులో ప్రథర్ మూడు కాన్ఫరెన్స్ ఛాంపియన్‌షిప్‌లు, నాలు ఎన్‌సీఏఏ ప్రదర్శనలు ఇచ్చి జట్టును నడిపించారు.రెండుసార్లు ఆల్ కాన్ఫరెన్స్ యూఎస్‌ఏగా ఎంపికయ్యారు.

అంతేకాకుండా అమెరికన్ వాలీబాల్ కోచ్స్ అసోసియేషన్‌కు ప్రథర్ పేరును నామినేట్ చేశారు.ఆమె 2002లో లూయిస్‌విల్లే విశ్వవిద్యాలయం నుంచి బిజినెస్ మార్కెటింగ్‌లో డిగ్రీ పట్టా, 2005లో అదే లూయిస్ విల్లే వర్సిటీ నుంచి స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు.

మెక్కా 1994 నుంచి 1997 వరకు సిరాక్యూస్‌ తరపున వాలీబాల్ ఆడటంతో పాటు సీనియర్ జట్టు కెప్టెన్‌గా పనిచేశారు.ఆమె సిరాక్యూస్ నుంచి మేనేజిరియల్ లా అండ్ పబ్లిక్ పాలసీలో డిగ్రీ, పొలిటికల్ సైన్స్‌లో పట్టాను పొందారు.2002లో ఇండియానా వెస్లియన్ విశ్వవిద్యాలయం నుంచి మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు.

తాజా వార్తలు

Former Volleyball Stars Carrie Mccaw And Lesley Prather And 2 Daughters Killed In Missouri-,lesley Prather,missouri,nri,telugu Nri News,volleyball Related....